Site icon NTV Telugu

Samantha: ఫిగర్ బావుంది కానీ.. ఫేస్ ఏంటి గుర్తుపట్టలేకుండా మారింది?

Samantha Ruthprabhu

Samantha Ruthprabhu

Samantha ruthprabhu Post Workout Photo goes Viral in social Media: ఈ మధ్యనే సమంత ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగాసమంతతో కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. సినిమా కథ రొటీన్ అనిపించినా సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మాయోసైటిస్ జబ్బు నేపథ్యంలో సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకున్న ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసింది. ఇటీవల విదేశాలకు వెళ్లి అక్కా ఖుషి సినిమా ప్రమోట్ చేస్తూనే మరోపక్క చికిత్స కూడా తీసుకుంది. ఇక మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆమె ప్రస్తుతం ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటుంది.

Kiki Vijay: ‘8 ఏళ్ల బ్రేకప్, మళ్లీ లవ్లో పడి పెళ్లి.. సీక్రెట్ బయటపెట్టిన నటుడి భార్య!

సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉండే ఆమె ఈ మధ్య ఇన్‌స్టా‌ స్టోరీలో భగవద్గీత చదువుతున్న ఫోటోస్ షేర్ చేసి చర్చనీయాంశం అయింది. ఇక ఇప్పుడు ఆమె పోస్ట్ వర్కౌట్ ఫొటో ఒకదానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలో ఆమె షేప్ భలే ఉంది కానీ ఫేస్ మాత్రం గుర్తు పట్టడానికి కొంచెం కష్టంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఫిగర్ బావుంది కానీ.. ఫేస్ ఏంటి గుర్తుపట్టలేకుండా మారింది? అని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారరు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సమంత నటించిన సైటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ రిలీజ్ కావాల్సి వస్తుంది. రిలీజ్ ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ ఈ సిరీస్ లో రాజ్ అండ్ డీకేలు ఈ సారి సమంతను మరో స్థాయిలో చూపించినట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీ మెన్ సెకండ్ సీజన్‌లో రాజీ పాత్రను మించేలా సమంత కారెక్టర్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఆమె పాత్రను ఎలా డిజైన్ చేశారో?.

Exit mobile version