NTV Telugu Site icon

Samantha: మాజీ భర్తను మర్చిపోయినా.. మరిదిని గుర్తుపెట్టుకొని మరీ విష్ చేసిందే

Sam

Sam

Samantha: అక్కినేని నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి, తమ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం చేసుకున్నారు. చూడముచ్చటైన జంట. ఈ జంట ఎప్పుడు మీడియా కంట కనిపించినా దిష్టి తగులుతుందేమో అన్నంతగా అభిమానులు మురిసిపోయేవారు. ఇక వదినమ్మను అఖిల్ అయితే అస్సలు వదిలిపెట్టేవాడు కాదట. ఫ్యామిలీ ఈవెంట్స్ కు, ప్రైవేట్ ఈవెంట్స్ కు సామ్ కు బాడీ గార్డ్ అంటే అఖిల్ అని చెప్పాలి. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒక బట్టల షాపు ఓపెనింగ్ కు సామ్, అఖిల్ తో పాటు వెళ్లగా.. అక్కడ వదినను జాగ్రత్తగా కాపాడింది అఖిల్ బాబునే. అంత ప్రేమ వదిన అంటే. సామ్ కూడా అఖిల్ ను ఎంతో ఇష్టపడుతుంది. చైతో కలిసి మరిదిగారిని ఏడిపిస్తూ కనిపించేది. అన్ని బావుంటే.. ఇప్పటికీ ఇలాంటి ఎన్నో ముచ్చట్లు వీరి మధ్య జరిగేవి. అయితే అన్ని మనం అనుకున్నట్లు జరిగితే దేవుడు ఉన్నది ఎందుకు.. అన్నట్లు ఈ జంట మధ్య విబేధాలు చినికి చినికి గాలివానగా మారి విడాకులు తీసుకొనేవరకు వెళ్లాయి.

Prithviraj: మలయాళం నుంచి సలార్ నటుడి పాన్ ఇండియా ప్రాజెక్ట్

విడాకుల తరువాత కూడా మేము స్నేహితుల్లా ఉంటామని ఈ జంట చెప్పుకొచ్చారు కానీ, ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి కనిపించనే లేదు. విడాకుల తరువాత కూడా అఖిల్, సామ్ తో టచ్ లో ఉన్నాడని టాక్. ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు అక్కినేని కుటుంబంలో ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన ఒకే ఒక్క హీరో అఖిల్. దాంతోనే తెలుస్తుంది సామ్ అంటే అఖిల్ కు ఎంత అభిమానమో. ఇక అభిమానాన్ని సామ్ సైతం చూపించింది. నేడు అఖిల్ పుట్టినరోజు కావడంతో అతడికి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టింది. అఖిల్ నటించిన ఏజెంట్ పోస్టర్ ను ట్యాగ్ చేస్తూ ” హ్యాపీ బర్త్ డే అఖిల్. ఏయ్.. ఏజెంట్ ఏప్రిల్ 28 న వస్తుంది. ఈ సినిమాతో మరింత ప్రేమను నువ్వు అందుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి దీనికి అయ్యగారు ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి. ఇక అఖిల్ కు సామ్ విష్ చేయడంతో.. మాజీ భర్తను మర్చిపోయినా మరిదిని గుర్తుంచుకుంది .. సంతోషం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments