NTV Telugu Site icon

Samantha: అలా సెట్ కు వెళ్లిందో లేదో ఇలా గాయాలపాలైంది..

Sam

Sam

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఈ సిరీస్ లో కనిపించనుంది. ఈ మధ్యనే ఈ సిరీస్ షూటింగ్ మొదలయ్యింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇక్కడ సమంత చేస్తోంది. ఇక ఈ చిత్రం కోసం సామ్ ఎన్నో రిస్క్ లు కూడా చేసింది.

Ajay Bhupathi: ‘మంగళవారం’ ఏం జరిగింది?

యాక్షన్ ఘట్టాల కోసం ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొంది. ప్రస్తుతం ఈ షూటింగ్ లో సామ్ కు గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తెలిపింది. రెండు చేతులకు తగిలిన గాయలను చూపిస్తూ పీర్క్స్ ఆఫ్ యాక్షన్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అభిమానులు మరోసారి సామ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజులు రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటే ఇలాగే అవుతుందని, ఇంకొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటే బావుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.ది ఫ్యామిలీ మ్యాన్ లో సామ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సిరీస్ లో ముద్దుగుమ్మ అంతకుమించిన యాక్షన్ స్టంట్స్ చేయనుందట. మరి ఈ సిరీస్ తో సామ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.