Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగులో ఖుషీ.. హిందీలో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ షూటింగ్స్ కోసం అమ్మడు హైదరాబాద్ టూ ముంబై ట్రావెల్ చేస్తూ ఉంది. ఇక మధ్య మధ్యలో ఎయిర్ పోర్టులోనే సామ్ దర్శనం ఇస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో సామ్ పోస్ట్లు పెట్టినా ఎయిర్ పోర్ట్ లుక్ లో ఉండే కిక్కే వేరు కదా.. ఎప్పుడు మేకప్ తో, హెవీ హెవీ డ్రెస్ లతో ఉండే స్టార్లను.. చాలా సింపుల్ గా చూడాలంటే ఎయిర్ పోర్ట్ ఒక్కటే దారి. సరే ఇప్పుడు ఇవ్వన్నీ ఎందుకు అంటే.. ప్రస్తుతం సామ్ ఎయిర్ పోర్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాషన్ కే బ్రాండ్ అంబాసిడరా అన్నట్లు సామ్ లుక్ కిర్రాక్ ఉంది. లూజ్ వైట్ ప్యాంట్.. దానిమీద టైట్ బ్లాక్ స్లీవ్ లెస్ టాప్.. నడుముకు బ్లాక్ జాకెట్.. ముఖానికి మాస్క్.. కళ్ళకు కళ్లద్దాలు.. చిన్న హెయిర్ క్లిప్ పెట్టి జుట్టును వదిలేసి.. ఎంతో స్టైలిష్ గా కనిపించింది.
Bro: ఆ షూ రేట్ ఏంది ‘బ్రో’ అంతుంది?
చిన్న బ్యాగ్ ఒకటి తగిలించుకొని.. ఒక చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని.. ఇంకోచేత్తో ఫోన్ మాట్లాడుకుంటూ చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతూ.. కెమెరాకు ఒక హాయ్ చెప్పేసి నవ్వేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఈ ఫోటోలు సోషల్ మీడియాకు చేరగానే .. అందరి లుక్ ఆమె చెప్పులు మీద పడ్డాయి. అవేమి అంత హెవీ హీల్స్ కాదు.. షూస్ అంతకన్నా కాదు. సాధారణమైన బ్లాక్ చెప్పులు.. ఏంటి బాబు అన్నావ్.. సాధారణమా.. ఆ చెప్పుల రేటు తెలిస్తే గుండెపోటు రావడం ఖాయం అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అవును ఆ చెప్పులు లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందినవి.. వాటి విలువా అక్షరాలా .. రూ. 2,58,097 ( రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొంబై ఏడు రూపాయలు). ఏది ఇప్పుడు చెప్పండి సాధారణ చెప్పులు అని. గుండె ఆగిపోతుంది కదా.. చెప్పులకు ఇంత రేటు ఏంటి అని.. ఆ చెప్పుల్లో దిండులాంటి మెత్తటి స్పాంజ్ లు ఉంటాయట. కాళ్లు ఎంతో కంఫర్ట్ గా ఉంటాయట. అందుకే దానికి అంత రేటు. ఇక పొద్దున్న బ్రో పోస్టర్ లో పవన్ వేసుకున్న షూస్ లక్ష రూపాయలు. ప్రస్తుతం వీరి పాదరక్షలు నెట్టింట సునామీని తెప్పిస్తున్నాయి.
