Samantha praises Miss Shetty Mr Polishetty: ఇటీవల కాలంలో నన్ను బాగా నవ్వించిన చిత్రమిదే అంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కి తన స్టైల్ లో రివ్యూ ఇస్తూ స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ. జవాన్ సినిమాతో పోటీ పడి రిలీజ్ అయినా ఈ సినిమాకు ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్ మారుతి ప్రసంశలు కురిపించగా..తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ప్రశంసలు కురిపించింది.
Allu Arjun: ‘జవాన్’లో ఆ పాత్రకు నో చెప్పి మంచి పని చేశావు బన్నీ!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూశాక స్టార్ హీరోయిన్ సమంత ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ ఇటీవల కాలంలో ఏ సినిమా నన్ను ఇంతగా నవ్వించలేదని పేర్కొంది. అనుష్క ఛార్మింగ్ గా కనిపించింది, నవీన్ పోలిశెట్టి సూపర్బ్ పర్ ఫార్మెన్స్ చేశాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రీసెంట్ గా రిలీజైన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని మేకర్స్ వెల్లడించారు. ఈ పాజిటివ్ టాక్ కు తగినట్లే మంచి వసూళ్లు దక్కించుకుంటోందని యూఎస్ లో 550 కె డాలర్స్ మార్క్ చేరుకున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వన్ మిలియన్ మైల్ స్టోన్ వైపు దూసుకెళుతోందని అన్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కించారు.