Site icon NTV Telugu

నేను డిమాండ్ చేయను… కానీ… ట్రోలింగ్ పై సమంత రియాక్షన్

Samantha

Samantha

సౌత్ స్టార్ హీరోయిన్ గా ఇప్పటికి వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్న సమంత ఇటీవల దారుణంగా ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే. నాగ చైతన్యతో 4 సంవత్సరాల వివాహ బంధం తర్వాత విడిపోతున్నట్లుగా రీసెంట్ గా ప్రకటించింది. సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో కఠినమైన స్టేజ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టింది. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తాను ఎదుర్కొన్న ఎడతెగని ట్రోలింగ్ గురించి సమంత స్పందించింది.

Read Also : ఫ్రెండ్స్ తో మహేష్ ఫ్యామిలీ వీకెండ్ మస్తీ… పిక్స్ వైరల్

అన్ని విషయాలను అందరూ అంగీకరిస్తారని తాను ఆశించడం లేదని, కానీ ఏదైనా ఒక భావాన్ని వ్యక్తం చేయడానికి ముందు కాస్త ఆలోచించాలని చెప్పుకొచ్చింది. “నేను అన్ కండిషనల్ యాక్సెప్టెన్స్ ను డిమాండ్ చేయను. విభిన్న అభిప్రాయాలను కలిగి ఉండమని ప్రజలను ప్రోత్సహిస్తాను. అయితే విభిన్నమైన అభిప్రాయాలూ ఉన్నప్పటికీ మనం ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు. ఒకరిపై కరుణను చూపించవచ్చు. వారి నిరాశను మరింత నాగరికంగా వ్యక్తం చేయమని మాత్రమే నేను వారిని రిక్వెస్ట్ చేస్తాను” అని చెప్పింది.

Read Also : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య… వీడియో వైరల్

కాగా సామ్ సినిమాల విషయానికొస్తే… సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్”లో స్పెషల్ సాంగ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన పౌరాణిక డ్రామా “శాకుంతలం” పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే నాటకం ఆధారంగా రూపొందింది. శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా, దుష్యంతగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతితో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రం షూటింగ్ ను కూడా ముగించింది. ఇటీవలే తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీని సామ్ ప్రకటించింది.

Exit mobile version