Site icon NTV Telugu

Chey fans trolling: క్లారిఫికేషన్ తో చాచికొట్టిన సమంత!

New Project (63)

New Project (63)

 

గత కొన్ని రోజులుగా నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తున్న విషయం తెలిసింది. నిజానికి నాగచైతన్య – సమంత విడిపోయిన తర్వాత కొద్దిరోజులు మౌనంగా ఉన్న ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్, పీఆర్ టీమ్ నేతృత్వంలో ఒకరిపై ఒకరు బురద చల్లడం మొదలెట్టారని తెలుస్తోంది. అయితే… సమంతపై ఎదురు దాడి చేస్తున్న చైతన్య అభిమానులను అడ్డుకోవడం కోసం అన్నట్టుగా ఆమె అభిమానులు ఇటీవల ఎదురుదాడి మొదలెట్టారు. నాగచైతన్య, శోభిత దూళిపాళతో డేటింగ్ చేస్తున్న అంశాన్ని హైలైట్ చేశారు. వివిధ వెబ్ సైట్స్ లో ఈ వార్త వచ్చింది. సో… వేరే హీరోయిన్ తో అఫైర్ నడుతున్న నాగచైతన్య అభిమానులు, తమ అభిమాన నటి సమంతను ఎలా విమర్శిస్తారనే వాదన మొదలెట్టారు. అయితే… దానిని తట్టుకోలేని నాగచైతన్య ఫ్యాన్స్ సమంతను మరింత దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. చిత్రం ఏమంటే… సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత పని కట్టుకుని ఇందులో కొన్ని విమర్శలకు తనదైన రీతిలో సమాధానాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది! తాజాగా మరోసారి సమంత అదే పనిచేసింది.

ఓ వెబ్ సైట్ లో సమంత, నాగచైతన్య అభిమానులు ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకుంటూ దూషించుకుంటున్నారని వచ్చిన వార్తను సమంత ట్యాగ్ చేసింది. అంతేకాదు… ‘అమ్మాయి మీద వచ్చే పుకార్లలో నిజం ఉందని ప్రచారం చేస్తారు. అదే అబ్బాయి విషయంలో వచ్చే పుకార్లను ఆ అమ్మాయి వర్గమే క్రియేట్ చేసిందని అంటూ ఉంటారు. ఇదేమి పని… ఎదగండి అబ్బాయిలూ… ఎదగండి… నిజానికి అందులో సంబంధం ఉన్న వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయారు… మీరూ వెళ్ళండి… మీ పని మీద, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి’ అంటూ తన మనసులోని బాధను వెళ్ళ గక్కుతూనే వాళ్ళకు గుణపాఠం చెప్పింది. ఇందులో ఎక్కడ నాగచైతన్యకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాకుండానే తనను ట్రోల్ చేస్తున్న వారి మెంటాలిటీని బయటపెట్టే ప్రయత్నం చేసింది. నిజానికి ఈ సమాజంలో అమ్మాయిల వ్యక్తిగత జీవితాన్ని విమర్శించినట్టు, అబ్బాయిల విషయంలో విమర్శలు రావు. అమ్మాయి చేస్తే తప్పు, అదే పని అబ్బాయి చేస్తే గ్రేట్ అన్నట్టుగా మనవాళ్ళ మనస్తత్వం ఉంటుంది. అదే విషయాన్ని సమంత నొక్కి చెప్పింది.

ఇదిలా ఉంటే… వెబ్ సైట్ లో వచ్చిన వార్తను సమంత ట్యాగ్ చేయడం ఏమిటీ? ఆమె కారణంగా ఈ వార్త జనాల్లోకి వెళ్ళింది. కాబట్టి నాగచైతన్యను బ్యాడ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే సమంత ఈ ఆర్టికల్ ను ట్యాగ్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. మరి వీటిపై సమ్ము ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version