NTV Telugu Site icon

Samantha: పాపం…. సమంతను తిట్టుకున్నారు కదరా… అనారోగ్యంలోనూ ఎంత కష్టపడుతుందో తెలుసా?

Samantha Us Promotions

Samantha Us Promotions

Samantha promoting Kushi in USA: స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోక పోవడంతో కొంత సమయం రెస్ట్ తీసుకోవడానికి ఆమె సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు కొన్నాళ్ళ క్రితం మీడియాకి లీకులు ఇచ్చింది. ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చి అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంటుదని ప్రచారం జరిగింది. అయితే ఆమె అమెరికా వెళ్ళకుండా నార్త్ ఇండియాలో ప్రక్రుతిలో సమయం గడిపింది. ఆ తర్వాత ఆమె సడన్ గా ఖుషీ సినిమా కన్సర్ట్ లో మెరిసింది. నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న క్రమంలో మ్యూజిక్ కన్సర్ట్ సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచేసింది.

గీత దాటేస్తున్న నభా.. ఇదేందయ్యా ఇదీ.. మరీ ఈ రేంజ్ హాట్ ట్రీటా?

ఇక ఈ దెబ్బతో ఆమె తనకున్న పాన్ ఇండియా అపీల్ తో వరుసగా ప్రమోషన్స్ చేసేసి పది రోజులు ఖుషి కోసం స్పెండ్ చేస్తుంది అనుకుంటే ఆ మ్యూజిక్ కన్సర్ట్ తర్వాత తల్లితో కలిసి సమంత విదేశాలకు వెళ్ళిపోయింది. అక్కడ ఆమె రెస్ట్ తీసుకుంటుంది, లేదా ట్రీట్మెంట్ కోసం సమయం వెచ్చిస్తుంది అణుకుతూనే న్యూయార్క్ లో ఆమె ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను నిత్యం అభిమానులతో షేర్ చేసుకుంటూ రావడం హాట్ టాపిక్ అయింది. ఒకపక్క విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ అన్నిటినీ తన భుజాల మీద వేసుకుని వరుస ప్రెస్ మీట్లకు అటెండ్ అవుతూ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఇక దీంతో నెటిజన్లు కొందరు సమంతను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ప్రమోషన్స్ చేయకుండా ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నావా..? అక్కడ ఫోటోలు దిగి షేర్ చేస్తూ ఎందుకిలా చేస్తున్నావని ట్రోల్ చేస్తున్నారు.

కానీ అసలు విషయం వేరే ఉందని అంటున్నారు. ఆమె ఇటీవల న్యూయార్క్ నగరంలో భారత స్వాతంత్ర్య పరేడ్‌లో పాల్గొన్నారు . ఆమె ఇప్పుడు టెక్సాస్‌లో జరిగే ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొని ఖుషిని ప్రమోట్ చేస్తుంది. విజయ్ దేవరకొండ భారతదేశంలో ఖుషిని ప్రమోట్ చేస్తుంటే, ఆమె యునైటెడ్ స్టేట్స్‌లో సినిమాను ప్రమోట్ చేస్తుందని అంటున్నారు. అటు విజయ్ కి ఇటు సమంతకి అక్కడ మార్కెట్ బానే ఉంది, ప్రమోట్ చేస్తే మరింత ఎఫెక్ట్ ఉంటుందని ఆమె అక్కడ సినిమాను ప్రమోట్ చేసిందని అంటున్నారు. ఇది చూసి సమంత అభిమానులు పాపం…. సమంతను తిట్టుకున్నారు కదరా… అనారోగ్యంలోనూ ఎంత కష్టపడుతుందో తెలుసా? అని అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments