NTV Telugu Site icon

Samantha: నువ్వు గెలవడం చూడాలనుంది.. సమంత షాకింగ్ పోస్ట్

Samantha

Samantha

Samantha Post about Winning goes Viral in Social Media: ప్రస్తుతం సినిమాలేవీ చేతిలో లేకపోవడంతో సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాంటి ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ పెట్టిన ఆమె నీ హృదయం ఏదైతే కోరుకుంటుందో, నువ్వు ఏ ఆశలు కలిగి ఉన్నావో, నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను. మీరు విజయానికి అర్హులు అంటూ సమంత పోస్ట్ పెట్టింది.

Poonam Pandey : పూనమ్ పాండేకి షాక్.. అది కావాలని అడిగిన చిన్నారి!

అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ ఈరోజు ఐపీఎల్ లో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ ఉండడంతో బెంగళూరు జట్టును ఉద్దేశించి పెట్టిందేమో అనుకుని ఆ జట్టు అభిమానులు ఆమె పోస్ట్ కి కామెంట్స్ పెడుతున్నారు. ఎప్పటిలాగే ఈ చాలా కప్ నమ్దే అంటూ ఆమె పెట్టిన పోస్ట్ కింద పెద్ద ఎత్తున కామెంట్లు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ఐపీఎల్ సీజన్లో ఎవరూ ఊహించని విధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. దీంతో ఆమె ఆ జట్టుకే సపోర్ట్ చేస్తోందేమో అని ఆ జట్టు అభిమానులందరూ భావిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మరి కొందరు అసలు ఆమె పెట్టిన పోస్ట్ కి క్రికెట్ కి సంబంధం లేదని ఏదో పర్సనల్ పోస్ట్ లాగా ఉందని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి దీని మీద సమంత క్లారిటీ ఇస్తే తప్ప ఆమె దేని గురించి మాట్లాడిందో తెలియదు.

Show comments