NTV Telugu Site icon

Samantha Ruth Prabhu: సమంత.. ముఖం కనిపించని ఆ వ్యక్తి ఎవరు?

Samantha Mysterious Man

Samantha Mysterious Man

Samantha Pic With Mysterious Man Going Viral In Social Media: సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అందరి కన్ను ఉంటుంది. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఎవరితో తిరుగుతుంటారు? ఏ వ్యక్తితోనైనా లవ్‌లో ఉన్నారా? అనే విషయాలు తెలుసుకోవడం కోసం తహతహలాడుతుంటారు. ఇది తెలిసి కూడా.. కొందరు తారలు అందరికీ అనుమానం వచ్చేలా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతుంటారు. ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్న ఫోటోలనో, లేకపోతే ఎవరో కనుక్కోండి చెప్మా? అనే పజిల్ తరహాలో పోస్టులు పెడుతూ.. ఊరిస్తూ ఉంటారు. ఇప్పుడు సమంత కూడా అదే పని చేసింది.

Ileana Dcruz: ఎట్టకేలకు ప్రియుడు ఫోటో రివీల్ చేసిన ఇలియానా.. కానీ!

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో తిరిగి యాక్టివ్ అయిన సమంత.. లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు ఫోటోలు షేర్ చేసింది. మొదటిది తన ఫోటో కాగా, రెండోది తన అపార్ట్‌మెంట్ నుంచి బయటి లొకేషన్ తీసిన ఫోటో. అయితే.. మూడో ఫోటో మాత్రం అందరిలోనూ క్యూరియాసిటీ రేకెత్తించింది. ఎందుకంటే.. అందులో ముఖం తెలియని ఓ వ్యక్తి ఉండటమే అందుకు కారణం. ఒక లొకేషన్‌లో ఆ వ్యక్తి పక్కనే నిల్చొని, సమంత ఏదో మాట్లాడుతున్నట్టు ఆ ఫోటోలో కనిపిస్తోంది. కానీ.. ఆ ఫేస్ కనిపించని వ్యక్తి ఎవరు అన్నది ఇక్కడ హాట్ టాపిక్‌గా మారింది. ఇంకేముంది.. నెటిజన్లు వెంటనే, ‘‘ఆ వ్యక్తి ఎవరు సమంత?’’ అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నకు సమంత బదులివ్వలేదు కానీ, ఆ వ్యక్తి ఎవరన్నది మిగతా నెటిజన్లు తేల్చేశారు.

Prakruti Mishra: ఆఫర్ల పేరుతో ఆ నిర్మాత వాడుకున్నాడు.. ప్రేమమ్ నటి సంచలన వ్యాఖ్యలు

ఆ వ్యక్తి మరెవ్వరో కాదు.. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌ని రూపొందిస్తున్న దర్శకులు రాజ్ అండ్ డీకేల్లో ‘డీకే’. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ సైబీరియాలో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడే ఉన్న సమంత.. లొకేషన్‌లో డీకేతో కలిసి ఆ ఫోటో దిగింది. సో.. ఇదన్నమాట ఆ ఫోటో వెనక ఉన్న మిస్టరీ. కాబట్టి.. ఏదేదో ఊహించేసుకోకండి. కాగా.. హాలీవుడ్‌లో రూపొందిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌కి ఇది హిందీ రీమేక్. ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.