Site icon NTV Telugu

షారూఖ్ కి మరోసారి హ్యాండ్ ఇచ్చిన సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కి మరోసారి హ్యాండ్ ఇచ్చిందట. షారుఖ్ ఖాన్‌తో అట్లీ చేయబోయే చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించాల్సింది. అదే జరిగితే సమంత బాలీవుడ్ ఎంట్రీ బిగ్ బ్యాంగ్ లో ఉండేది. ఆ సినిమాలో హీరోతో ప్రేమలో పడే పోలీస్ ఆఫీసర్ పాత్రను సమంత చేయవలసి ఉంది. ఏమైందో ఏమో సమంత ఆ చిత్రం నుండి నిష్క్రమించింది. దాంతో అట్లీ నయనతారను ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. కరోనా కారణంగా, షారూఖ్ తనయుని కేసు వల్ల సినిమా ఆలస్యం అయింది. అంతే కాకుండా నయనతార తన పెళ్ళి కారణంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు సిగ్నల్ ఇచ్చింది.

ఇక అదే టైమ్ లో సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకోవడంతో బాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగమమం అయినట్లు అయింది. ఇక సమంత గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే తరువాయి అనుకున్న వారికి షాక్ తగిలింది. సమంత షారూఖ్ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపలేదు. సమంత ఆసక్తి కనబరచకపోవడంతో ఇప్పుడు అట్లీ మళ్లీ నయనతార వైపు మొగ్గుచూపుతున్నాడని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు. షారుఖ్ ఖాన్ తన కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఎదురైన కష్టాల నుండి బయటపడటంతో ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Exit mobile version