NTV Telugu Site icon

Samantha: టీమ్ లో అమ్మాయిలు లేరా.. లేక సామ్ కన్నా గొప్పవారు లేరా..?

Sam

Sam

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడుతోంది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడానికి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే సిటాడెల్ సిరీస్ కోసం సామ్ ముంబైలో అడుగుపెట్టేసింది. ఈ సిరీస్ తో పాటు సామ్ నటిస్తున్న చిత్రం ఖుషీ. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. అయితే మధ్యలో సామ్ కు మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో కొన్నిరోజులు ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చారు మేకర్స్. ఇక చాలా రోజుల తరువాత సామ్ ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టింది. దీంతో చిత్ర బృందం ఆమెకు వార్మ్ వెల్ కమ్ చెప్పారు. అంతేకాకుండా నిన్న ఉమెన్స్ డే కూడా కావడంతో ఆమెకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించారు.

Manchu Lakshmi: అర్ధరాత్రి నడిరోడ్డుపై పోలీస్ అఘాయిత్యం.. రక్తం మరిగిపోతుందన్న మంచక్క

ఇక ఈ వేడుకలో హీరో విజయ్, దర్శకుడు శివ నిర్వాణ, మిగిలిన టెక్నీషియన్స్ అందరు పాలుపంచుకున్నారు. అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఈ వేడుకల్లో సామ్ తప్ప మరో అమ్మాయి కనిపించలేదు. దీంతో అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. మూవీ టీమ్ మొత్తంలో మరో అమ్మాయి లేదా..? లేక వారందరు సమంత కన్నా గొప్పవారు కాదా..? అని ప్రశ్నిస్తున్నారు. ఎంత వార్మ్ వెల్ కమ్ పార్టీ అయినా కూడా ఉమెన్స్ డే అంటే ఆమె ఒక్కరికే చేస్తున్నారా..? మిగతా టెక్నీషియన్స్ లో ఉన్న ఆడవారు కూడా మహిళలే కదా.. వారితో సహా కేక్ కట్ చేసి ఉంటే బావుండేది అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments