సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నా మాధ్యమాయలో ఫోటోషూట్లతో అమ్మడు సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇక తాజాగా అమ్మడు పీకాక్ మ్యాగజైన్ పై పీకాక్ లా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ సామ్ ఒక నోట్ రాసుకొచ్చింది.
“ఒకప్పుడు నా స్కిన్ టోన్ తో నేను కంఫర్ట్ బుల్ గా లేను. కంఫర్ట్ బుల్ గా ఉండేందుకు నాకు కొంత సమయం పట్టింది. అది తెలియకుండానే నేను చాలా సినిమాలు చేసేశాను. అయితే ఇప్పుడు సెక్సీ సాంగ్ చేయడానికైనా, హార్డ్ కోర్ యాక్షన్ సహా ఢిపరెంట్ రోల్స్ లో కనిపించడానికైనా నేను కంఫర్ట్ బుల్ గా ఉన్నాను. అన్ని చేయగలనని నా మీద నాకు నమ్మకం వచ్చింది. ఇంతకు ముందు ఆ ధైర్యం, నమ్మకం లేదు. ఇది వయస్సుతో పాటు వచ్చిన మెచ్యూరిటీ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం సామ్ శాకుంతలం, యశోద చిత్రాల్లో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు అమ్మడికి ఎలాంటి విజయాన్ని సాధించిపెడతాయో చూడాలి.
