సౌత్ హీరోయిన్ సమంతకు చిత్ర పరిశ్రమలో స్నేహితులు ఎక్కువే.. నిత్యం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వారి పుట్టినరోజు వస్తే స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతుంది. తాజాగా ఆమె నందిని రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. చిత్రపరిశ్రమలో డైరెక్టర్ నందిని రెడ్డి, సమంత మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ చిన్మయి, నందిని రెడ్డి, సామ్ ముగ్గురు కలిస్తే రచ్చ రచ్చేనని అందరికి తెల్సిందే. ఇక తాజాగా నేడు నందిని రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ ఎమోషనల్ కి గురైంది.
” 2012 లో నాకు జరిగిన ఒక ఘటన వలన నేను ఎంతో లో గా ఫీల్ అయ్యాను. నా కెరీర్ మీద ఆశలు వదులుకున్నాను.. నేను చాలా నమ్మకం కోల్పోయాను. అలాంటి సమయంలో నువ్వు వచ్చావు.. నాలో స్ఫూర్తి నింపావు. నాకు ఆత్మ విశ్వాసంగా మారావు. నీ విలువైన సమయాన్ని నాకోసం వెచ్చించావు. ప్రతిరోజు నాతో మాట్లాడి నాలో తిరిగి ఆత్మ విశ్వాసం నింపావు. నువ్వు ఇచ్చిన స్పూర్తితో నేను మళ్లీ వర్క్ లోకి దిగాను. ఎప్పటికి కూడా నేను నువ్వు పంచిన స్ఫూర్తిని మర్చిపోలేను. నందిని రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇక ఏ నందిని, సామ్ కాంబోలో జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు వచ్చిన సంగతి తెల్సిందే . ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
