Site icon NTV Telugu

Samantha: సర్జరీ కోసం అమెరికాకు సమంత.. దేని కోసం ఇంకా..?

Sam

Sam

Samantha: సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. ఆ వార్త నిజమా..? కాదా..? అనేది పక్కన పెడితే సామ్ కు సంబంధించిన న్యూస్ అయితే చాలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇక గత కొన్నిరోజుల నుంచి సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విషయం విదితమే. దీనిపై పలు పుకార్లు షికార్లు చేస్తూ వస్తున్నాయి. ఒకటా .. రెండా రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉంది. సమంత సర్జరీ చేయించుకొందని కొందరు.. సామ్ చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది మరికొందరు.. ఇవేమి కాదు సామ్ షూటింగ్ లో బిజీగా ఉందని ఇంకొందరు రకరకాలుగా చెప్పుకొస్తున్నారు.

ఇక తాజాగా వీటికి తోడు ఇంకో పుకారును పుట్టించేశారు. సమంత సర్జరీ కోసం అమెరికా వెళ్లిందని, అక్కడే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నట్లు వార్త గుప్పుమంటుంది. అయితే ఇప్పటికే సామ్ తన ముఖానికి పలుమార్లు సర్జరీ చేయించుకుందని టాక్.. మరి ఇప్పుడు ఇంకా దేనికి సర్జరీ..? అని నెటిజన్లు అనుమానిస్తున్నారు. అయితే అది సర్జరీ కాదని, సామ్ స్కిన్ ఎఫెక్ట్ కావడంతో ఆ ర్యాషెస్ పోవడానికి ఒక చిన్న ట్రీట్ మెంట్ చేస్తున్నారని సమాచారం. కొన్నిరోజులు ఆమెకు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు తెలపడంతో సామ్ బయటకు రావడంలేదట. మరికొన్ని రోజుల్లో సామ్ ఇండియాకు రానుందని, అప్పటినుంచి ఆమె తన రొటీన్ లైఫ్ ను లీడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో కూడా నిజం ఉందా..? లేదా అనేది తెలియాలి. ఇకపోతే ప్రస్తుతం సామ్.. యశోద, శాకుంతలం చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉన్నాయి.

Exit mobile version