Site icon NTV Telugu

మరో మైల్ స్టోన్ దాటిన సామ్

Samantha

Samantha

దక్షిణాది స్టైల్ ఐకాన్, ఫ్యాషన్ దివా సమంత రూత్ ప్రభు తన కెరీర్లో మరో మైల్ స్టోన్ దాటింది. ఇంట్లో ఉన్నా లేదా ఏదైనా ఈవెంట్‌లో ఉన్నా సమంత డ్రెస్సింగ్ స్టైల్ ట్రెండ్‌ను పర్ఫెక్ట్‌గా మారుస్తుంది. సోషల్ మీడియా క్వీన్ అయిన సమంత రూత్ ప్రభుకు తన పోస్ట్‌లతో ఎలా అందరి దృష్టిని ఆకర్షించాలో బాగా తెలుసు. ఆమె ఏదైనా పోస్ట్ చేస్తే చాలు నిమిషాల్లోనే దానికి లక్షల్లో లైకులు, షేర్లు వస్తాయి. ఆమెకు సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఘనత సాధించింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్‌ను అధిగమించింది. నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత చేసిన అరుదైన ఫీట్ ఇది.

Read Also : ఒకనాడు రామారావు… నేడు ‘అఖండ’ : బాలకృష్ణ

ఇక సామ్ సినిమాల విషయానికొస్తే ఆమె సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్”లో స్పెషల్ సాంగ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘పుష్ప’ సెట్స్‌లో చేరిన సామ్, బన్నీపై మేకర్స్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన పౌరాణిక డ్రామా “శాకుంతలం” పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం కాళిదాసు రచించిన ‘అభిజ్ఞానశాకుంతలం’ అనే నాటకం ఆధారంగా రూపొందింది. శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా, దుష్యంతగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతితో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రం షూటింగ్ ను కూడా ముగించింది. ఇటీవలే తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీని సామ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Exit mobile version