Samantha: సాధారణంగా ఎవరికైనా ఎన్నో ఏళ్ళ నుంచి ఒక పని చేస్తూ ఉంటూ.. మధ్యలో ఆపేస్తే.. ఆ పని తిరిగి మొదలుపెట్టేవరకు వారి మనసు ఆగదు. అది అందరికి తెల్సిన విషయమే.. తాజాగా సమంత కూడా తన మనసును ఆపుకోలేకపోయింది. ఏ విషయంలో అనుకుంటున్నారా.. వర్క్ అవుట్స్ చేయడంలో.. సమంత వ్యాపకాలు ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి పెట్స్ తో ఆదుకోవడం.. రెండు జిమ్ లో కష్టపడడం.. ఈ రెండే సామ్ కు తెల్సినవి. ఈ మధ్యనే మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డ సామ్ జిమ్ కు దూరంగా ఉంటూ చికిత్స తీసుకొంది. ఇప్పుడిప్పుడే అమ్మడు కోలుకొంటూ బయటికి వస్తుంది. సామ్ ఆరోగ్యంగా తిరిగిరావాలని అభిమానులు మొక్కిన మొక్కులకు దేవుడు కూడా కరిగిపోయి ఆమెను మళ్లీ ఆరోగ్యంగా అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం సామ్.. శాకుంతలం సినిమాలో నటిస్తోంది. వచ్చే నెల ఈ సినిమా రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సామ్ సిద్ధమవుతోంది.
ఇక మరోపక్క తన రొటీన్ లైఫ్ ను స్టార్ట్ చేసేసింది. తాజాగా ఆమె జిమ్ లో ఫుల్ వర్క్ అవుట్స్ చేస్తూ దర్శనమిచ్చింది. ఫుల్ అప్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఒక అద్భుతమైన కొటేషన్ కూడా రాసుకొచ్చింది. ” లావుగా ఉన్న మహిళ ఇవి చేసేవరకు ఆగదు. మీరు నాకు కొన్ని కఠినమైన రోజులలో స్పూర్తినిచ్చారు. బలం అంటే మనం తీసుకునే ఆహారం ఇమ్యూనిటీ ఫుడ్ కాదు.. మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బలం..” తన జిమ్ కోచ్ గురించి చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడే కదా సామ్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నావ్.. ఇప్పుడే ఇవన్నీ అవసరమా..? మళ్లీ మొదలెట్టేశావా సామ్.. ఆగలేకపోతున్నట్టున్నావ్ గా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.