Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజులుగా ఆమె ఈ వ్యాధితో పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ వ్యాధి బయటపడిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో సామ్ గురించిన వార్తలు కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డాయి. ఆ వ్యాధి భయంకరమని, సామ్ కండీషన్ సీరియస్ అని, అక్కడ చికిత్స తీసుకొంటుందని, ఇక్కడకు వెళ్లిందని, సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని ఇలా చాలా పుకార్లు, షికార్లు చేశాయి. అందులో ఏ నిజం లేదని, సామ్ విశ్రాంతి తీసుకుంటుందని, త్వరలోనే ఆమె స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వనుందని ఆమె పిఆర్ టీమ్ చెప్పుకురావడంతో ఆ పుకార్లకు చెక్ పడింది.
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ ఈ వ్యాధి వలన పూర్తిగా సోషల్ మీడియాకు దూరమయ్యింది. ఈ మధ్యనే అడపాదడపా పోస్ట్లు పెడుతూ అభిమానులను పలకరిస్తోంది. తాజాగా అంత బాధలోనూ సామ్ తన అభిమానులకు న్యూయర్ విషెస్ చెప్పుకొచ్చింది. ” బాధ్యతలు ముందుకు తీసుకెళ్లాలి. మనంఏం చేయగలమో వాటిని కంట్రోల్ చేయండి. కొత్త కోరికలను, కొత్త రిసోల్యూషన్స్ ను కనిపెట్టండి. మన కోరికలు నెరవేరడంలో ఆ దేవుని దయ మనకు ఉంటుంది. హ్యాపీ న్యూయర్ 2023″ అంటూ పోస్ట్ చేసింది. దీంతో పాటు తన కొత్త ఫోటోను షేర్ చేసింది. క్యాజువల్ లుక్ లో సామ్ ఎంతో అందంగా కనిపిస్తోంది. మేకప్ లేకపోయినా సామ్ అందంగానే ఉంది. అయితే అంతకముందు ఉన్న కళ కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. ఇక చాలా రోజుల తరువాత సామ్ కనిపించడంతో అభిమానులు ఆమెను మిస్ అవుతున్నట్లు చెప్తూ.. త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.
https://twitter.com/Samanthaprabhu2/status/1608431314889498624?s=20&t=yFqqK-bCHsxOTtdWreISew
