Site icon NTV Telugu

Samantha: బాత్ టబ్ ఫొటోలు వైరల్.. సమంత కీలక వ్యాఖ్యలు?

Samantha Insta Post

Samantha Insta Post

Samantha Cryptic Quote amid Bathtub Photo Rumors: నటి సమంత ఎక్కువగా సోషల్ మీడియా లోనే సమయం వెచ్చిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె కెరియర్ మొదటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగానే సమయం గడుపుతూ ఉండేది. దానికి తోడు నాగచైతన్యతో విడాకుల తర్వాత మరింత ఎక్కువగా సమయం గడపడం మొదలు పెట్టింది. అయితే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఆవిరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా పోస్ట్ పెట్టింది. అయితే ఆ తర్వాత బాత్ టబ్ లో సెమీ నేక్డ్ గా ఉన్న ఫోటో షేర్ చేసిందని షేర్ చేసిన కొద్దిసేపటికి దాన్ని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ నుంచి డిలీట్ చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం మీద సమంత అభిమానులు మండిపడుతున్నారు. నిజానికి అలాంటిదేమీ లేదని, కావాలనే కొంతమంది ఇలాంటి ఫేక్ ఫోటోలను సృష్టించి సమంతా పెట్టి డిలీట్ చేసిందని ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు.

కూతురు అయిపోయింది.. ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్న హీరోయిన్ కొడుకు?

అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వివాదం ఇలా నడుస్తున్న సమయంలో సమంత ఒక కొటేషన్ షేర్ చేసింది. ఆ కొటేషన్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఇంగ్లీషులో ఆమె మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించడమే అసలైన విజయం అంటూ రాసుకొచ్చింది. అంటే ఏం జరిగినా ఒకళ్ళ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించగలిగితే అదే పెద్ద విజయం అంటూ ఆమె కామెంట్ చేయడం చూస్తుంటే తాను ఇలాంటి విషయాల మీద స్పందించాల్సిన అవసరమే లేదు అన్నట్లుగా పరోక్షంగా కామెంట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే ఆమె సిటాడిల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ లో నటించింది. రాజ్ డీకే డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఆమె మా ఇంటి బంగారం అనే మరో సినిమా కూడా అనౌన్స్ చేసింది. అది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు.

Exit mobile version