NTV Telugu Site icon

Shaakuntalam : కీలక అప్డేట్ ఇచ్చిన సామ్

Shakunthalam

సౌత్ స్టార్ సమంత ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరక్కుతున్న “కాతు వాకుల రెండు కాదల్” సినిమా షూటింగ్, డబ్బింగ్ ను సామ్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” నుంచి కీలక అప్డేట్ ను షేర్ చేసింది ఈ బ్యూటీ. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం “శాకుంతలం”. ఇందులో యువరాణి శకుంతలగా కనిపించబోతోంది సామ్. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే తాజాగా డబ్బింగ్ పూర్తి చేశానంటూ సామ్ ఇన్స్టా లో వెల్లడించింది. ఇంకేముంది సామ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “శాకుంతలం” మూవీ విడుదలకు మరో అడుగు ముందుకేసినట్టే.

Read Also : Sanjay Dutt : డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలేనట !!

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇక “శాకుంతలం”లో రాజు దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతోంది. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల, వర్షిణి సౌందరరాజన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించనున్నారు. మరో వైపు సామ్ ఖాతాలో యశోద, సిటాడెల్, అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ వంటి చిత్రాలు ఉన్నాయి.