NTV Telugu Site icon

Samantha: బహుశా.. బంగారు బొమ్మ అంటే ఇలానే ఉంటుందేమో

Sam

Sam

Samantha: ఏ మాయ చేశావే అంటూ తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్టవేసుకోని కూర్చుండి పోయింది సమంత రూత్ ప్రభు. అమ్మడికి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో హేటర్స్ కూడా అంతే మంది ఉన్నారు. సక్సెస్ ఉన్నప్పుడే శత్రువులు ఎక్కువగా ఉంటారు అన్న పెద్దలు ఊరికే చెప్పలేదు. హేటర్స్ ఎప్పుడు హేట్ చేస్తూనే ఉంటారు.. వాటిని పట్టించుకోకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లి.. మనం హ్యాపీగా ఉండాలి. ఇదే సామ్ ఫిలాసఫీ. అనుకున్నట్లుగానే ట్రోల్స్ ను కానీ, విమర్శలను కానీ సామ్ పట్టించుకోకుండా విజయపథంలో దూసుకుపోవడానికి రెడీ అవుతోంది. ఇక చైతన్యతో విడాకులు తీసుకున్నప్పుడు కానీ, మయోసైటిస్ తో హాస్పిటల్ లో చేరినప్పుడు కానీ ఆమె పడిన బాధను వర్ణించడం కష్టతరమే. ఎన్ని విమర్శలు.. ఆ విమర్శలను తట్టుకొని నిలబడడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. అది సామ్ చేసి నిలబడి.. అనారోగ్యం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతోంది.

Balagam: నంది అవార్డు అందుకున్న ‘బలగం’.. ఓటిటీ బాట పట్టిందోచ్

ఇక ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హిందీ వెబ్ సిరీస్ లు పక్కనపెడితే.. తెలుగులో ఖుషీ, శాకుంతలం సినిమాల్లో నటిస్తుంది. శాకుంతలం వచ్చే నెల రిలీజ్ కు సిద్ధమవుతోంది. స్టార్ డైరెక్టర్ గగుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సామ్ శకుంతల గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఒకపక్క ఇంటర్వ్యూలు.. ఇంకోపక్క సోషల్ మీడియాలో కొత్త పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. తాజాగా సమంత కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బంగారు వర్ణం దుస్తుల్లో సామ్ దేవతలా మెరిసిపోతుంది. ఈ సినిమా కోసం సామ్ అన్ని బంగారు నగలనే వాడిందట. బంగారు వర్ణం దుస్తులు.. ఒంటినిండా బంగారు నగలతో సమంత బంగారు బొమ్మల మెరిసిపోతోంది. నిజంగా బంగారు బొమ్మ దిగివస్తే ఇలాగే ఉంటుందా..? అని అనిపించేలా ఉంది ఆమె అందం. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా సామ్ కు ఎలాంటి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.