Naga Chaitanya- Samantha:మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యనే వీరి ప్రేమను పెద్దలకు చెప్పి.. వారి అంగీకారంతోనే కొన్ని నెలలు క్రితం చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక పెళ్లి మాత్రం తమకు నచ్చినట్లుగానే ఇటలీలో జరుపుకుంటున్నారు. నవంబర్ 1 న వీరి వివాహం ఇటలీలో గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే హల్దీ, మెహందీ , సంగీత్ వేడుకలు మొదలయ్యాయి. గత రాత్రి జరిగిన కాక్ టైల్ పార్టీలో మెగా – అల్లు కుటుంబాలు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ పెళ్ళికి ఇండస్ట్రీ నుంచి కేవలం నలుగురు మాత్రమే అటెండ్ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్ పెళ్ళికి హీరో నితిన్.. కుటుంబంతో సహా అటెండ్ అవుతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. నితిన్ ఆల్రెడీ ఇటలీలో రెండు రోజుల క్రితమే అడుగుపెట్టేసాడు.
Vishnupriyaa Bhimeneni: అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే !
ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ పెళ్ళికి మాజీ జంట హాజరుకానున్నట్లు సమాచారం. వారి అక్కినేని నాగ చైతన్య,సమంత. అవును.. మీరు విన్నది నిజమే.. ఈ జంట .. వరుణ్, లావణ్య పెళ్ళికి హాజరు అవుతున్నారట. గత రాత్రి వీరు ఇటలీకి బయలుదేరినట్లు సమాచారం. అయితే వేరే వేరే ఫ్లైట్స్ లోనే వెళ్లారట. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడేళ్లు కూడా కలిసి లేకుండా విబేధాల వలన విడిపోయారు. విడాకుల తరువాత వీరు కలిసి కనిపించింది లేదు. వీరు కలిసే ఏకైక వేదిక వరుణ్ పెళ్లి మాత్రమే. మరి అక్కడైనా వీరు కలిసి మాట్లాడుకుంటారా.. ? లేదా ఎవరి దారిన వారు వెళ్లి వచ్చేస్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ముగ్గురు కాకుండా అందాల భామ రష్మిక కూడా ఈ పెళ్ళికి హాజరుకానుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే పెళ్లి ఫోటోలు బయటకు వచ్చేహ్వరకు ఆగాల్సిందే.