దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు అంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు ఎక్కువగా ఇదే పద్దతిని ఆచరిస్తూ ఉంటారు. స్టార్ డమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఒక పక్క సినిమాలు.. మరోపక్క వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. భర్త నాగ చైతన్యతో విడిపోయాక అమ్మడు ఫుల్ గా కెరీర్ మీదే ఫోకస్ పెట్టింది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ మరోపక్క వరుస వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.
ఇక నిత్యం ఏదో ఒక పోస్ట్ పెట్టి నెటిజన్స్ ట్రోలింగ్ కి గురయ్యే అమ్మడు తాజాగా మరోసారి ట్రోల్ కి గురైంది. ఇటీవల సామ్.. ఒక ఆల్కహాల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రమోషన్ చేస్తూ కనిపించింది. చేతిలో గ్లాస్ అది ఇది లేకపోయినా ప్రమోషనల్ యాడ్ లో మాత్రం మితిమీరి మతి అందాలను ఆరబోసింది. ఎద అందాలను ఆరబోస్తూ కొంచెం బోల్డ్ లుక్ లో కనిపించింది. దీంతో నెటిజన్స్ అమ్మడిని ఏకిపారేస్తున్నారు.. స్టార్ హీరోయిన్ అనే సంగతే మరిచిపోయావా.. విడాకుల తరువాత ఇంతలా దిగజారాలా అని కొందరు.. ఛీఛీ .. డబ్బు కోసం ఎంతకైనా దిగుజారతావా.. అని మరికొందరు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఇలా చేస్తుంది కాబట్టే అక్కినేని ఫ్యామిలీ ఈమెను వదిలించుకుంది అంటూ గట్టిగా విమర్శిస్తున్నారు.. మరి ఈ కామెంట్స్ పై సామ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.