NTV Telugu Site icon

Shakuntalam: వెనక్కి వెళ్లిన శాకుంతలం… సమంతా ఫాన్స్ కి వెయిటింగ్ తప్పదు

Shakuntalam

Shakuntalam

హెల్త్ ప్రాబ్లమ్ తో ఆడియన్స్ కి దూరమైన సమంతా ‘శాకుంతలం’ సినిమాతో మళ్లీ దగ్గరవుతుంది అని అంతా అనుకున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీతో సమంతా సాలిడ్ కంబ్యాక్ ఇస్తుంది, ఆమె బాక్సాఫీస్ స్టామినా ఏంటో శాకుంతలం ప్రూవ్ చేస్తుందని సామ్ ఫాన్స్ కూడా హాప్ పెట్టుకున్నారు. ఫిబ్రవరి 17న సమంతా శాకుంతలం రిలీజ్ అవ్వాల్సి ఉండగా, ఆ మూవీ విడుదలని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తాం అంటూ దిల్ రాజు అండ్ టీం స్టేట్మెంట్ ఇచ్చారు.

Read Also: Kantara: మీరు చూసింది పార్ట్ 2నే, రాబోయేది పార్ట్ 1…

కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ శాకుంతలం సినిమాలో దేవ్ మోహన్, దుష్యంతుడు పాత్రలో నటించాడు. సమంతా శకుంతలా దేవి పాత్రలో నటించింది, ఈమె కొడుకు భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అర్హా నటించింది. ఫిబ్రవరి 17 నుంచి శాకుంతలం సినిమా ఎందుకు వాయిదా పడింది అనే విషయంలో మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇదే రోజున తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సార్, గీత ఆర్ట్స్ 2 ప్రొడ్యూస్ చేస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. ఈ సినిమాల కారణంగా శాకుంతలం బాక్సాఫీస్ కలెక్షన్స్ ని వచ్చే నష్టం పెద్దగా లేకపోవచ్చు కానీ సోలో రిలీజ్ అయితే బెటర్ అనే ఫీలింగ్ లో శాకుంతలం సినిమాని మేకర్స్ వాయిదా వేసి ఉండొచ్చు. అయితే శాకుంతలం సినిమా వాయిదా పడడం ఇదే మొదటిసారి కాదు 2022 నవంబర్ 4న ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రావాల్సి ఉంది కానీ 3D వర్క్స్ పెండింగ్ ఉండడంతో అప్పుడు వాయిదా వేశారు.