Site icon NTV Telugu

Samajavaragamna : ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ప్రకటించిన ఆహా ఓటీటీ సంస్థ..

Whatsapp Image 2023 07 21 At 9.33.52 Am

Whatsapp Image 2023 07 21 At 9.33.52 Am

యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ సామజవరగమన. ఈ సినిమా జూన్‌ 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రతీ ప్రేక్షకుడు సినిమా చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేసారు.ఈ సినిమాలో ముఖ్యంగా సీనియర్‌ నరేష్‌ క్యారెక్టర్ అద్భుతం అని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలు కూడా సామజవరగమన సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. సుమారు రూ.7కోట్ల బడ్జెట్‌తో తెరెక్కిన ఈ సినిమా నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ సామజవరగమన ను సినిమాకు ప్రేక్షకులు వెళ్తూనే వున్నారు.థియేటర్ లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి.. అలా మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ గా నిలిచిన సామజవరగమన ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో జులై 28న సామజవరగమన సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. ఆహా సంస్థ ఈ మేరకు సోషల్‌ మీడియా లో ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.’నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం. సామజవరగమన దానికి చక్కటి రూపం. ఇక నో ఆలస్యం..ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం’ అంటూ సామజవరగమన ఓటీటీ విడుదల తేదిని అనౌన్స్‌ చేసింది ఆహా. ఈ సినిమాను రామ్‌ అబ్బరాజు తెరకెక్కించారు.ఈ సినిమాలో రెబా మోనికా జాన్‌ హీరోయిన్‌గా నటించింది..సుదర్శన్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా సామజవరగమన సినిమాను నిర్మించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయిన వారు ఓటీటీ లో చూసేయాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

https://twitter.com/ahavideoIN/status/1682216323257110530?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1682216323257110530%7Ctwgr%5Eadffe4bcd500842dc4e0173bd204234272f7182d%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Exit mobile version