Salman Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో ఎన్నో వివాదాలు ఆయన్ను చుట్టు ముట్టాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని మళ్లీ సినిమాల్లోనే బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న సికిందర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సినిమా బాగా లేకపోతే ఏ ఇండస్ట్రీ అయినా ఆడదని చెప్పాడు. ప్రస్తుతం హిందీలో సినిమాలు సరిగ్గా ఆడట్లేదని.. మంచి కంటెంట్ రాకపోతే తన సినిమా అయినా సరే ప్రేక్షకులు చూడరని సల్మాన్ ఖాన్ తెలిపాడు.
Read Also : Bajinder Singh: రేప్ కేసులో దోషిగా తేలిన ‘‘యేషు యేషు’’ పాస్టర్ బజిందర్ సింగ్..
‘హిందీలో సౌత్ హీరోలు రజినీకాంత్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, సూర్య సినిమాలు బాగానే ఆడుతున్నాయి. ఎందుకంటే మేం అక్కడ వారి సినిమాలు థియేటర్లకు వెళ్లి చూస్తాం. కానీ సౌత్ ఇండియా సినిమా ప్రేక్షకులు మా సినిమాను థియేటర్ల దాకా వెళ్లి చూడరు. మా మీద వారికి అభిమానం ఉంటుంది. కానీ ఆ అభిమానం థియేటర్ల దాకా తీసుకెళ్లదు. అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్ లో ఇంకా అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. సికిందర్ తో ఆ వెలితి తీరుతుందని అనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సికిందర్ తో హిట్ కొడుతాడా లేదా అన్నది వేచి చూడాలి.