NTV Telugu Site icon

Salman Khan: జైల్లో టాయిలెట్స్ కడిగా.. సల్మాన్ సెన్సేషనల్ కామెంట్స్

Salman

Salman

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా కాకుండా హిందీ బిగ్ బాస్ ను మకుటం లేని మహారాజుగా సల్మాన్ ఏలుతున్న విషయం తెల్సిందే. హిందీ బిగ్ బాస్ ను సల్మాన్ లేకుండా ఊహించుకోవడం కష్టమే అని చెప్పుకోవాలి. ఇకపోతే ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 నడుస్తుంది. ప్రతివారం సల్మాన్ పంచ్ లతో ఓటిటీ అదిరిపోతోంది. ఇక తాజాగా ఈ వేదికపై సల్మాన్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. కంటెస్టెంట్ లో ఒకరైన పూజా భట్ గ్రాండ్ ఫినాలే నుంచి ఎలిమినేట్ అవుతున్నసందర్భంలో ఆమె శుభ్రతపై ఉన్న కమిట్ మెంట్ ను మెచ్చుకుంటూ సల్మాన్ తన జీవితంలో జరిగిన ఒక విషయాన్ని పంచుకున్నాడు. ప్రపంచంలో ఏ పని చిన్నది కాదు అని, ప్రతిపనిని ఇష్టంగా చేయాలనీ తెలిపాడు. అంతేకాకుండా తానూ కూడా చిన్నతనంలోలో బోర్డింగ్ స్కూల్లో ఉన్నప్పుడు.. జైల్లో ఉన్నప్పుడు టాయిలెట్స్ కడిగినట్లు చెప్పుకొచ్చాడు.

Ram Gopal Varma: వ్యూహం టీజర్ చూడమని వారిని నేనేం అడుక్కోను..

” పూజా భట్ చాలా మంచి చేసింది. ఆమె శుభ్రతకు నేను ముగ్దుడును అయ్యాను. ఏ పనిని అల్పమైనదిగా తీసుకోకూడదు. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆమె టాయిలెట్లు శుభ్రం చేయడంపై ఎంతో అమితాసక్తిని చూపించింది. నేను గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ కు బుద్ధిచెప్పడానికి నేనే స్వయంగా ఇంటి లోపలి వెళ్లి టాయిలెట్స్ శుభ్రం చేశాను. నేను జైలులో ఉన్నప్పుడు బోర్డింగ్ స్కూల్ చదువుతున్న రోజుల్లో కూడా టాయిలెట్స్ ను శుభ్రం చేసేవాడిని.. ” అని చెప్పుకొచ్చాడు. ఇక సల్మాన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికి తెల్సిందే. కృష్ణ జింకలను వేటాడిన కేసులో కొన్నేళ్లు జైల్లో ఉండాల్సి రాగా.. మరొకసారి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ జైలు జీవితాన్ని గడిపాడు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments