Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Salman Khan 1 300kb

Salman Khan 1 300kb

Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 20’ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. సెలబ్రిటీల వయసు, బరువు, లుక్స్, కుటుంబం, కెరీర్ ఫెయిల్యూర్స్‌తో పాటు తల్లి కావడాన్ని కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసే వారిపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా తనపై వచ్చే ట్రోలింగ్‌కు కూడా ఘాటుగా సమాధానం ఇస్తూ కెమెరా ముందే షర్ట్ విప్పడంతో ఈ ఎపిసోడ్ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఎవరినైనా ట్రోల్ చేయడానికి కారణం ఏమిటని సల్మాన్ ప్రశ్నించారు. వయసు పెరిగిందని, బరువు పెరిగిందని, లుక్స్ మారాయని, కుటుంబం గురించి, సినిమా ఫ్లాప్ అయిందని, చివరికి ఎవరైనా తల్లి అయ్యారని కూడా ట్రోల్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి కామెంట్లు చేసే వాళ్లు తమ పెంపకాన్ని బయటపెడుతున్నారని, ముందుగా వాళ్ళ ఫేస్ ను అద్దంలో చూసుకోవాలని వ్యాఖ్యానించారు. సెలబ్రిటీల జీవితంలోని ప్రతి విషయాన్ని సోషల్ మీడియా కామెంట్లతో కొలవడం సరైన పద్ధతి కాదని ఆయన ఘాటుగా స్పందించారు.

తన వయసుపైనా వస్తున్న కామెంట్లను సల్మాన్ ప్రస్తావించారు. తనకు 60 ఏళ్లు వచ్చాయని, వయసు పెరగడం సహజమేనని అన్నారు. తన బరువు, వయసు, జుట్టు, లుక్ గురించి ట్రోల్ చేసే వారికి సమాధానం ఇస్తూ ఆయన టోపీ, జాకెట్ తొలగించి చివరకు షర్ట్ కూడా విప్పారు. తనను ట్రోల్ చేయాలంటే చేసుకోవచ్చంటూ కెమెరా ముందే సవాల్ విసిరారు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదే సమయంలో ప్రసవం తర్వాత మహిళల శరీరంలో వచ్చే మార్పులను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడంపైనా సల్మాన్ తీవ్రంగా స్పందించారు. ప్రెగ్నెన్సీ తర్వాత బరువు పెరగడం సహజమేనని, ఆ తర్వాత తిరిగి పని మొదలుపెట్టినప్పుడు ఫిట్‌గా మారే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆయన ఈ సందర్భంగా ఏ సెలబ్రిటీ పేరు నేరుగా ప్రస్తావించలేదు. అయితే ఇటీవల ప్రసవం తర్వాత తన రూపం, బరువు విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న కత్రినా కైఫ్‌ను ఉద్దేశించే సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ మొదలైంది.

కత్రినా ఇటీవల తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అంబానీ కుటుంబం నిర్వహించిన గణేశ్ చతుర్థి వేడుకలకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె ప్రసవానంతర లుక్‌పై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ వ్యాఖ్యలు రావడంతో నెటిజన్లు వాటిని కత్రినా ట్రోలింగ్‌తో లింక్ చేస్తున్నారు. అంతేకాదు మహిళా సెలబ్రిటీల ఫొటోలు తీసే కొందరు పాపరాజీల తీరుపైనా సల్మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెనుక నుంచి ఫొటోలు తీస్తూ మహిళల కాళ్లు, తొడలు, నడుము వంటి శరీర భాగాలపై ఫోకస్ చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి ఫొటోల వల్ల చాలామంది మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారని, దీనిపై మహిళలు ప్రశ్నించాలని ఆయన సూచించారు. ఏదేమైనా ‘బిగ్ బాస్ 20’ తాజా ‘వీకెండ్ కా వార్’లో సల్మాన్ షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు ఇచ్చిన కౌంటర్ మాత్రం ఇప్పుడు షోలోనే హాట్ టాపిక్‌గా మారింది.