NTV Telugu Site icon

AR Murugadoss: భాయ్ తో మరో స్పైడర్ తీస్తున్నావా మురగదాస్ మావా.. ?

Salman

Salman

AR Murugadoss: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఏఆర్ మురగదాస్ ఒకరు. గజిని, స్టాలిన్, 7th సెన్స్, తుపాకీ లాంటి హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ మురగదాస్. 2017 లో మహేష్ బాబుతో స్పైడర్ అనే సినిమాను తీసి భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి మురగదాస్ కు ఒక్క హిట్టు కూడా దక్కలేదు. ఇక 2020లో రజనీకాంత్ దర్బార్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మురగదాస్.. ఇక ఎట్టకేలకు ఒక భారీ బడ్జెట్ సినిమాను లైన్లో పెట్టాడు. నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో మురుగదాస్ ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడు అయిన సాజిత్ నదియాడవాలా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇది గ్లోబల్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కుతోందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అని, యూరోప్ లోని కొన్ని దేశాలతో పాటు పోర్చుగల్ లో ఈ సినిమాను చిత్రీకరించనునట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ అంతా సిద్ధం అయ్యిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా పైనే మురగదాస్ జీవితం ఆధారపడి ఉందని చెప్పాలి. ఎందుకంటే నాలుగేళ్లుగా మురుగదాస్ హిట్ అందుకున్నది లేదు. సల్మాన్ తో సినిమా అంటే మాటలు కాదు. హిట్ అయ్యింది అంటే బాలీవుడ్లో పాగా వేసేయొచ్చు. దీంతో అభిమానులు మురగదాస్ కు లక్కీ ఛాన్స్ వచ్చింది అని చెప్పుకొస్తున్నారు. ఇక తెలుగు అభిమానులు మాత్రం భాయ్ తో మరో స్పైడర్ తీస్తున్నావా మురగదాస్ మావా.. ? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో మురగదాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments