Site icon NTV Telugu

Salman Khan : 60 ఏళ్లకైనా తండ్రి కావాలనుకుంటున్న – సల్మాన్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్

Salmankhan

Salmankhan

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంతోనే హాట్ టాపిక్ అవుతుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట హాట్‌గా మారాయి. ఈ మధ్య కాలంలో టాక్ షోలు బాగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే కొత్త టాక్‌షోలో ఇటివల ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన ప్రోమో అల్ రెడి చూశాం. దొరికిందే ఛాన్స్ అనట్లుగా కాజోల్ ఇంకా ట్వింకిల్ ఇద్దరూ సెలబ్రిటీలను పెనంలో పెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. అయితే మొదటి ఎపిసోడ్‌లో సల్మాన్, ఆమిర్ ఖాన్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. ఇందులో సల్మాన్ గతంలో హీరోయిన్లతో ఉన్న రిలేషన్‌షిప్‌ల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం షాక్ ఇచ్చింది..

Also Read : OG: ఓజీ మూవీ ప్రీమియర్స్‌లో..స్క్రీన్‌ను చింపి అభిమానుల రచ్చ..

“అవును, నేను చాలా మంది తో డేటింగ్ చేశాను. కానీ ఆ సంబంధాలను కొనసాగించలేక పోవడానికి నాదే తప్పు. ఈ విషయంలో నేను నన్ను నిందించుకుంటాను” అని సల్మాన్ అంగీకరించారు. అంతేకాకుండా ఊహించని రీతిలో.. “నేను ఏదో ఒక రోజు పిల్లలను కనాలనుకుంటున్నా. చివరికి ఎవరికి పిల్లలు పుడతారు.. చూద్దాం ఏమవుతుందో!” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే బంధం లో ఒకరికొకరు మించి ఎదిగితే సమస్యలు వస్తాయి.. ఇద్దరూ కలిసి ఎదిగితే సంబంధం బలంగా ఉంటుందని సల్మాన్ తన అనుభవం పంచుకున్నారు. కాగా ఈ షో సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. సల్మాన్-ఆమిర్‌తో మొదలైన ఈ షోలో, తరువాతి ఎపిసోడ్‌లలో గోవిందా-చంకీ పాండే, జాన్వీ-కరణ్ జోహార్, ఆలియా-వరుణ్ ధావన్ జంటలు గా కనిపించనున్నారు.

Exit mobile version