Salman Khan : 60 ఏళ్లకైనా తండ్రి కావాలనుకుంటున్న – సల్మాన్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంతోనే హాట్ టాపిక్ అవుతుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట హాట్‌గా మారాయి. ఈ మధ్య కాలంలో టాక్ షోలు బాగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే కొత్త టాక్‌షోలో ఇటివల ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన ప్రోమో అల్ రెడి చూశాం. దొరికిందే ఛాన్స్ అనట్లుగా కాజోల్ ఇంకా ట్వింకిల్ ఇద్దరూ సెలబ్రిటీలను పెనంలో పెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. అయితే మొదటి ఎపిసోడ్‌లో సల్మాన్, ఆమిర్ ఖాన్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. ఇందులో సల్మాన్ గతంలో హీరోయిన్లతో ఉన్న రిలేషన్‌షిప్‌ల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం షాక్ ఇచ్చింది..
Also Read : OG: ఓజీ మూవీ ప్రీమియర్స్‌లో..స్క్రీన్‌ను చింపి అభిమానుల రచ్చ..
Also Read
- Indian Movies: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే!
- Janhvi Kapoor: 'రాకా'లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
- Secret Soldier : టైటిల్ మారింది.. 'సీక్రెట్ సోల్జర్'గా వస్తున్న 'చైనా పీస్'!
- Shah Rukh Khan: ‘కింగ్’ నిర్మాతలపై కాసుల వర్షం.. మ్యూజిక్ రైట్స్‌తోనే సరికొత్త చరిత్ర!
“అవును, నేను చాలా మంది తో డేటింగ్ చేశాను. కానీ ఆ సంబంధాలను కొనసాగించలేక పోవడానికి నాదే తప్పు. ఈ విషయంలో నేను నన్ను నిందించుకుంటాను” అని సల్మాన్ అంగీకరించారు. అంతేకాకుండా ఊహించని రీతిలో.. “నేను ఏదో ఒక రోజు పిల్లలను కనాలనుకుంటున్నా. చివరికి ఎవరికి పిల్లలు పుడతారు.. చూద్దాం ఏమవుతుందో!” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే బంధం లో ఒకరికొకరు మించి ఎదిగితే సమస్యలు వస్తాయి.. ఇద్దరూ కలిసి ఎదిగితే సంబంధం బలంగా ఉంటుందని సల్మాన్ తన అనుభవం పంచుకున్నారు. కాగా ఈ షో సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. సల్మాన్-ఆమిర్‌తో మొదలైన ఈ షోలో, తరువాతి ఎపిసోడ్‌లలో గోవిందా-చంకీ పాండే, జాన్వీ-కరణ్ జోహార్, ఆలియా-వరుణ్ ధావన్ జంటలు గా కనిపించనున్నారు.
తాజావార్తలు
-
SRSP Project Update: ఎస్సారెస్పీపై ఉత్తమ్ కీలక ప్రకటన.. రైతులకు గుడ్‌న్యూస్.?
-
Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
-
Kulgam: కుల్గామ్‌లో పహల్గామ్ సీన్ రిపీట్.. హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి!
-
Anupama: బ్యాడ్ డేస్ ని అసలు మాటల్లో చెప్పలేను!
-
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!