NTV Telugu Site icon

Salman Khan: ఏయ్.. నాకు పెళ్లి వద్దు.. కానీ, పిల్లలు మాత్రం కావాలి.. అది కూడా అలా

Sallu

Sallu

Salman Khan: ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనగానే టక్కున సల్మాన్ ఖాన్ అని చెప్పేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక ముందు ముందు అయినా సల్లు భాయ్ పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే .. ఆయన వయస్సు 57. ఇంకో మూడేళ్ళలో 60 కు చేరుకుంటాడు. అందుకే సల్మాన్ పెళ్లి గోలను అభిమానులు అడగడం కూడా మానేస్తున్నారు. పెళ్లి మాత్రమే సల్లు భాయ్ కు కాలేదు.. ప్రేమలు, ఎఫైర్లకు అతగాడికి ఎటువంటి లోటు లేదు. మంచి ఫ్యామిలీ, సినిమాలు, ఆదరించే అభిమానులు .. ఇక ఇంతకంటే ఎవరికైన ఏం కావాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సల్మాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను విప్పాడు. పెళ్లి చేసుకోరా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడంతో పాటు అంతకుమించిన విషయాన్నీ చెప్పి షాక్ ఇచ్చాడు. పెళ్లి వద్దు కానీ, పిల్లలు కావాలి అంటూ అందరిని షేక్ చేసేలా చేశాడు.

Dhee Choreographer Chaitanya: బ్రేకింగ్.. ఆ బాధ తట్టుకోలేక ఢీ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య

” ఇప్పుడు ఇంటికి కోడలు తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదు కానీ, నాకు పిల్లలు కావాలి. ఒక పాపను పెంచుకోవాలి అనుకుంటున్నాను. అందుకు లీగల్ గా మన భారతీయ చట్టాలు అంగీకరిస్తాయో.. లేదో తెలియదు. చూడాలి. ” అని చెప్పుకొచ్చాడు. అయితే సల్లు భాయ్ మనసులో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు కానీ పిల్లల చేత తండ్రి అని పిలిపించుకోవాలని మాత్రం చాలా తాపత్రయ పడుతున్నట్లు అర్ధమవుతుంది. అసలు సల్లు భాయ్.. తన కెరీర్ మొదలు పెట్టినప్పటినుంచి స్టార్ హీరోయిన్లతో ఘాటు ప్రేమాయణాలు నడిపాడు. ఐశ్వర్య, కత్రీనా, ప్రియాంక, జియా.. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఎప్పుడు ఎఫైర్ గురించి బయటికి వచ్చినా.. మా సల్లు భాయ్ కు ఈసారి పెళ్లి అవుతుంది అని అభిమానులు మురిసిపోయేవారు. కానీ, ఆ హీరోయిన్లు.. సల్లు భాయ్ కు బ్రేకప్ లు చెప్పడం, వేరేవారిని పెళ్లి చేసుకోవడం జరుగుతూనే ఉన్నాయి.. కానీ, సల్మాన్ కు మాత్రం పెళ్లి పీటలు ఎక్కే కోరిక మాత్రం తీరలేదు. మరి కోర్టు అయినా సల్లూ భాయ్ ఈ కోరికను అయినా తీరుస్తుందేమో చూడాలి.

Show comments