Site icon NTV Telugu

నెక్స్ట్ మూవీ టైటిల్ రివీల్ చేసిన సల్మాన్

Salman-Khan

ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు సల్మాన్ ఖాన్. ఆయన తన సినిమా కెరీర్లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించడమే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఈ రోజు సల్మాన్ తన 56 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సల్మాన్ సోషల్ మీడియా అకౌంట్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, స్నేహితుల నుండి ఆయనకు బర్త్ డే విషెస్ శుభాకాంక్షలతో ముంచెత్తారు. సూపర్ స్టార్ కూడా తన పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులకు సరైన ట్రీట్ ఇచ్చాడు. తన నెక్స్ట్ మూవీ టైటిల్ ను స్వయంగా ప్రకటించాడు.

https://ntvtelugu.com/playback-singer-actor-manikka-vinayagam-passes-away/

తన పుట్టినరోజు సందర్భంగా ఇటీవలి ఇంటరాక్షన్ లో సల్మాన్ తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “భజరంగి భాయిజాన్” సీక్వెల్ టైటిల్‌ను వెల్లడించాడు. సల్మాన్ ‘భజరంగీ భాయిజాన్ 2’ కోసం రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి పని చేయడం గురించి ప్రస్తావించాడు. దాని గురించి మాట్లాడుతూ ఈ చిత్రానికి ‘పవన్ పుత్ర భాయిజాన్’ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నాడు. ‘టైగర్ 3’ షూటింగ్ పూర్తయిన తర్వాత సల్మాన్ ‘నో ఎంట్రీ’ సీక్వెల్, ‘కభీ ఈద్ కభీ దీపావళి’లో పని చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆ తరువాత ‘భజరంగీ భాయిజాన్2’ ఉంటుంది. ప్రస్తుతానికి ఆయుష్ శర్మతో కలిసి ‘యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్‌’లో చివరిసారిగా కనిపించిన సల్మాన్, కత్రినా కైఫ్ సరసన తన టైగర్ ఫ్రాంచైజీ మూడవ విడతలో పని చేస్తున్నాడు.

Exit mobile version