Site icon NTV Telugu

Salman Khan: రిపోర్టర్ కి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్…

Salman Khan

Salman Khan

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. టైగర్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ మూడో సినిమా టాక్ యావరేజ్ గానే ఉంది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. వరల్డ్ కప్ మ్యాచుల సమయంలో టైగర్ 3 కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయ్యాయి కానీ మళ్లీ పుంజుకుంటున్నాయి. డిసెంబర్ 1 వరకు బాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల లేదు కాబట్టి మరో వారం పాటు టైగర్ 3 హవా కొనసాగే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ మార్క్ చేరువలో ఉన్న టైగర్ 3 సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల మార్క్ ని టచ్ చేసి థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత హిట్ కొట్టిన జోష్ లో ఉన్న సల్మాన్ ఖాన్… ఒక రిపోర్టర్ ని కిస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సల్మాన్ ఖాన్ ని ఎప్పుడు చూసినా సీరియస్ గా ఉంటాడు కానీ చాలా రేర్ గా సరదాగా ఉంటాడు. అలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ కి సల్మాన్ ఖాన్ తన మేనల్లుడు అలీజా అగ్నిహోత్రితో కలిసి అటెండ్ అయ్యాడు. అలీజా ఇటీవలే ఫెర్రీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలీజాతో కలిసి గోవా ఫెస్టివల్ లో తిరుగుతూ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కి సంబందించిన ఒక లేడీ సీనియర్ రిపోర్టర్ ని “ఎలా ఉన్నారు” అని పలకరిస్తూ ఆమె నుదిటిపై ముద్దు పెట్టాడు. ఆ సీనియర్ రిపోర్టర్ కూడా సల్మాన్ ఖాన్ ని సరదాగా పలకరించింది. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Exit mobile version