Site icon NTV Telugu

‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ తో సల్మాన్ స్టెప్పులు… ఊర నాటు

RRR

“ఆర్ఆర్ఆర్” టీం తమ సినిమాను అన్ని విధాలుగా రెస్ట్‌లెస్‌గా ప్రమోట్ చేస్తోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ పై దృష్టి పెట్టారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. అందులో భాగంగానే హిందీలో అత్యంత పాపులర్ అయిన టీవీ రియాల్టీ షో “బిగ్ బాస్ 15″కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఎస్ఎస్ రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు.

https://ntvtelugu.com/singer-lisa-gentile-accusing-chris-noth-harresed/

స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోలో అలియా భట్ తెలుగులో కొన్ని మాటలు మాట్లాడింది. అంతేకాదు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కి రామ్ చరణ్, తారక్ ఫేమస్ ‘నాచో నాచో’ స్టెప్ నేర్పించారు. తరువాత సల్మాన్, ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ సాంగ్ కు స్టెప్పులు వేశారు. ఈ ఎపిసోడ్ త్వరలో కలర్స్ ఛానెల్‌లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం 5 భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఇక రీసెంట్ గా ముంబైలో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు న్యూఇయర్ సందర్భంగా ప్రసారం కానున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు హిందీలో పాపులర్ అయిన ‘కపిల్ శర్మ’ కామెడీ షోలోనూ ఈ టీం సందడి చేసింది.

Exit mobile version