Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తన గురుంచి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేతన్ కక్కడ్ పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పన్వేలో ఉన్న సల్మాన్ ఫామ్ హౌస్ పక్కన నివసించే కేతన్ కక్కడ్ అనే వ్యక్తి .. పన్వేలోని గణేశుని ఆలయాన్ని స్వాధీన పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, సల్మాన్ ను బాబర్ ఓరంగజేబ్ తో పోలుస్తూ కేతన్ ఒక వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఇంకా ఈ వీడియోలో కేతన్, సల్మాన్ పరువుకు భంగం కల్గించేలా మాట్లాడిన మాటలు హిందూ ముస్లిం ల మధ్య ఘర్షణలు రేకెత్తించేలా ఉండడంతో వెంటనే ఈ వీడియోలను తొలగించాలని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సివిల్ కోర్టు అందుకు అనుమతించకపోవడంతో ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.
కేతన్ వీడియోలను వెంటనే డిలీట్ చేయించి, ఇకముందు తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక సల్మాన్ తరుపున న్యాయవాది మాట్లాడుతూ.. కేతన్ చెప్పినవన్నీ అవాస్తవాలని, వాటి వలన సల్మాన్ పరువుకు భంగం కలిగే ప్రమాదం ఉందని, అంతేకాకుండా సల్మాన్ తన ఫామ్ హౌస్ లో చిన్న పిల్లలను ఆక్రమ రవాణా చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, వీటి వలన సల్మాన్ ను అభిమానించే వారికి అతడిపై నమ్మకం పోతుందని తెలిపాడు. ఆ వీడియోలను వెంటనే తొలగించడానికి అనుమతించాలని కోరారు. మరి ఈ కేసుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక సల్మాన్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం సల్మాన్ ‘కభీ ఈద్ కభీ దివాళీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఇది కాకుండా తెలుగులో చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ లో గెస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
