Site icon NTV Telugu

అమితాబ్ బాడీ గార్డ్ జీతం ఎంతో తెలుసా ?

Salary of Amitabh Bachchan's personal bodyguard Jitendra Shinde

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన ఎక్కడికి వెళ్లినా తన పర్సనల్ బాడీ గార్డ్ వెంట ఉండాల్సిందే. లేకపోతే ఆయన బయటకు వెళ్ళినప్పుడు అభిమానులు చుట్టు ముడతారు. వారి నుంచి ఆయన బయటపడడం కష్టమవుతుంది. అలా అభిమానుల తాకిడి నుంచి ఆయనను దూరంగా ఉంచుతూ ఎప్పుడూ అమితాబ్ జాగ్రత్త గురించి ఆయనపై కన్నేసి ఉంచుతాడు ఈ బాడీ గార్డ్. అమితాబ్ వ్యక్తిగత బృందంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఈ బాడీ గార్డ్. అమితాబ్ బచ్చన్ సినిమాలు, టీవీ షూటింగులు, ఇల్లు ఇలా ఎక్కడికెళ్లినా ఆయన భద్రత కూడా చూసుకుంటారు. మరి ఆయనను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్న బాడీ గార్డ్ పేరు, ఆయనకు అమితాబ్ ఇచ్చే జీతం ఎంతో తెలుసా ?

Read Also : ఈరోజు బాక్స్ ఆఫీస్ బరిలో 5 సినిమాలు

బిగ్ బి బాడీగార్డ్ పేరు జితేంద్ర షిండే. జితేంద్ర అమితాబ్ నీడ. అమితాబ్ ఎక్కడికి వెళ్లినా జితేంద్ర కూడా ఆయనతో నడుస్తూ కనిపిస్తాడు. ఓ నేషనల్ మీడియా ప్రకారం అమితాబ్ బచ్చన్ ప్రతి సంవత్సరం 1.5 కోట్లు జితేంద్ర షిండేకు జీతంగా ఇస్తున్నారు. జితేంద్రకు స్వంత సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఉంది. కానీ ఆయన మొదటి నుండి అమితాబ్ బచ్చన్‌ దగ్గరే పని చేస్తున్నాడు. అందుకే అమితాబ్ కూడా ఆయనను స్వంత వ్యక్తిలా చూసుకుంటాడు.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కిట్టిలో అల్విడ, గుడ్ బై, బ్రహ్మాస్త్రా, ఆదిపురుష్ చిత్రాలు ఉన్నాయి. దీనితో పాటు ప్రసిద్ధ క్విజ్ షో “కౌన్ బనేగా కరోడ్‌పతి-13″కు హోస్ట్ గా చేస్తున్నాడు.

Exit mobile version