Site icon NTV Telugu

Salaar: సినిమాకే హైలైట్ గా నిలిచిన యాయా ఫుల్ సాంగ్ వచ్చేసింది

Salaar

Salaar

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆరేళ్ళ తరువాత ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. దేవాగా ప్రభాస్ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దాదాపు రూ. 600 కోట్లకు పైగా కలక్షన్స్ అందుకున్న ఈ సినిమా ఇంకా థియేటర్ లో విజయవంతంగా ప్రదరిస్తున్నారు. ఇక ఈ మధ్యనే సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా ఓటిటీలోకి రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటిటీ హక్కులను సొంతం చేసుకుంది. ఇక సలార్ లోని హైలైట్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

సలార్ సినిమాకు హైలైట్ అంటే ఇంటర్వెల్ సీన్. అదేనండీ కాటేరా ఫైట్ సీన్. చిన్న పిల్లలని కూడా చూడకుండా.. విలన్స్.. ఆడపిల్లలను అత్యాచారం చేస్తుంటే.. అక్కడ ఉన్నవారందరూ.. కాటేరమ్మ దైవం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో దేవా వచ్చి వారిని అంతమొందిస్తాడు. ఇక ఆ సమయంలో యాయా అంటూ ఒక సాంగ్ వస్తుంది. ఒక ముసలవ్వ ఈ సాంగ్ పాడుతూ ఉంటుంది. ఆరు సేతులున్నా కానీ ఆదుకొనే సెయ్యి రాదమ్మా.. అంటూ కాటేరమ్మ ను పిలుస్తూ ఉండే సాంగ్ ఇది. ఇక ఈ సాంగ్ కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. కనకవ్వ ఆలపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version