NTV Telugu Site icon

Salaar: ఇది శాంపిల్ మాత్రమే… ఆగస్టులో వచ్చే ట్రైలర్ మీ ఊహకే వదిలేస్తున్నాం

Salaar

Salaar

ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ బయటకి వచ్చి 100 మిలియన్ వ్యూస్ రాబట్టి డిజిటల్ రికార్డ్స్ ని పునాదులతో సహా కదిలించాడు. ముందస్తు హెచ్చరికలు లేకుండా తుఫాన్ వస్తే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సలార్ టీజర్ విషయంలో జరిగింది ఇదే. తెల్లవారుఝామున టీజర్ రిలీజ్ చేస్తున్నారు. దీన్ని అంత ఉదయాన్నే ఎవరు నిద్రలేచి చూస్తారులే అనుకున్నారు కానీ ప్రతి ఒక్కరు నిద్రపోకుండా టీజర్ చూసి, దాన్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత పడుకున్నారు. ప్రభాస్ ఫేస్ ని పూర్తిగా రివీల్ చెయ్యకుండా టీజర్ కి కట్ చేస్తేనే ఇంపాక్ట్ ఈ రేంజులో ఉంటే ట్రైలర్ బయటకి వస్తే… డిజిటల్ రికార్డ్స్ ని ఒక డైనోసర్ వచ్చి అమాంతం మిగేస్తే ఎలా ఉంటుందో ఊహించొచ్చు.

ఆగస్టు నెలలో ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నాం, ట్రైలర్ తో పాటు మరిన్ని అప్డేట్స్ కూడా బయటకి వస్తాయి… సలార్ ఇండియా గర్వించదగ్గ సినిమా అవుతుంది. ఆగస్టు నెల ఇండియన్ సినిమాకి చాలా స్పెషల్ గా నిలుస్తుంది. అప్పటివరకు వెయిట్ చెయ్యండి అంటూ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. దీంతో సలార్ ట్రైలర్ మరో నెల రోజుల్లో బయటకి వస్తుంది అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ట్రైలర్ తో పాటు సలార్ నుంచి ఇంకేమి అప్డేట్స్ వస్తాయి అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే టీజర్ మత్తులో నుంచి ఫాన్స్ ఇంకా బయటకి రాలేదు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ లు విధ్వంసానికి శాంపిల్ ని చూపించేసారు. ఇక ఆగస్టు నెల కోసం వెయిట్ చెయ్యడమే.

Show comments