Site icon NTV Telugu

Salaar Trailer: ప్రభాస్ యుద్ధం.. చూడడానికి ఇండస్ట్రీ మొత్తం సిద్ధం

Prabhs

Prabhs

Salaar Trailer: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని సాంగ్స్ పాడుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఎన్ని.. ఎన్ని.. ఎన్ని రోజులు ఈ రోజు కోసం ఎదురుచూసామో.. ఆరోజు వస్తుంటే ఊపిరి ఆడేలా లేదు అని ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉత్సాహం ఆపుకోలేకపోయారు. ఎందుకు .. ఇదంతా అంటే.. సలార్ ట్రైలర్ రేపే రానుంది. ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, సలార్ పేరు వినపడడం ఆలస్యం.. సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Naga Chaitanya: ఇదెక్కడి ట్విస్ట్ బ్రో.. రేపు అన్నారు.. ఈరోజే వచ్చింది

ఇక సినిమా నుంచి ఒక్క లీక్ కూడా లేకుండా శిల్పం చెక్కినట్లు చెక్కుతున్నాడు ప్రశాంత్ నీల్. దీంతో ట్రైలర్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రేపు రాత్రి 7.19 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. దీంతో ఈఅభిమానులుకు ఈ నైట్ నిద్రపట్టదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ట్రైలర్ చూసినవాళ్లు .. అసలు క్లాస్, మాస్ కలగలిపి ఉందని, ఇలాంటి ట్రైలర్ ఇంతకు ముందు లేదని చెప్తుంటే.. హైప్ ఆకాశాన్ని దాటుతుంది. ఎప్పుడెప్పుడు ఈ నైట్ గడుస్తుందా.. రేపు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. రేపు మొత్తం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ మేనియానే సోషల్ మీడియాలో నడుస్తుంది అని చెప్పొచ్చు, రికార్డులు బద్దలు కొట్టడానికి ఫ్యాన్స్ సిద్ధంగాఉన్నారు. మరి ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టబోతుందో చూడాలి.

Exit mobile version