Site icon NTV Telugu

Salaar Trailer: సలార్ ట్రైలర్ వచ్చేసింది .. ప్రభాస్ బీభత్సమే

Sal

Sal

Salaar Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ట్రైలర్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన రోజులు చాలా ఉన్నాయి. ఎట్టకేలకు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ట్రైలర్ మొత్తం ప్రభాస్ భీబత్సం కనిపిస్తుంది. అసలు ఆ మ్యూజిక్ కు .. ప్రభాస్ ఎలివేషన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంతకు ముందెన్నడూ ప్రభాస్ ను ఇలా చూడలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినిమా మొత్తం ప్రభాస్ వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు. గూస్ బంప్స్ వచ్చేలా ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్.

Exit mobile version