NTV Telugu Site icon

Salaar: సలార్ అప్డేట్ వచ్చిందిరోయ్..

Salaar

Salaar

Salaar: సలార్.. సలార్.. ప్రస్తుతం సలార్ సినిమా గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా కోసం అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచుస్తున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇంకోపక్క సలార్ మరోసారి వాయిదా పడుతుందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా మేకర్స్ దీనికి క్లారిటీ ఇవ్వమని కూడ కామెంట్స్ చేస్తున్నారు.

Anchor Suma: గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన సుమ తాత.. ఎందుకో తెలుసా?

ఇక అభిమానుల బాధను అర్ధం చేసుకున్న మేకర్స్ .. ఎట్టకేలకు సలార్ అప్డేట్ ను అందించారు. ట్రైలర్ అనౌన్స్ మెంట్ వస్తుందని చెప్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ మారకపోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెప్పిన డేట్ కే సలార్ వస్తుంది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ట్రైలర్ త్వరలోనే రిలీజ్ అని కూడా చెప్పేశారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 1 న సలార్ ట్రైలర్ రానుందని చెప్పుకొస్తున్నారు. మరోపక్క ప్రభాస్ విదేశాల నుంచి వచ్చాడు. ఇక ప్రమోషన్స్ షురూ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Show comments