Site icon NTV Telugu

Salaar: ఆల్ ఇండియా రికార్డ్.. నెం.1 హీరో

Salaar Rights

Salaar Rights

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దెబ్బకు రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. ప్రభాస్ కటౌట్‌కి ఒక మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో ఛత్రపతి సినిమాతో చూపించాడు రాజమౌళి. ఇక ఇప్పుడు అలాంటి కటౌట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తే.. ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. అందుకు శాంపిల్‌గా సలార్ నిమిషంన్నర టీజర్ అని చెప్పొచ్చు. సలార్ టీజర్‌లో అసలు ప్రభాస్‌ను చూపించకుండానే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఇంత ఈగర్‌గా వెయిట్ చేసిన టీజర్ మరోటి లేదనే చెప్పాలి. అందుకే సలార్ టీజర్ బయటికి రాగానే… ఒక్కసారిగా సోషల్ మీడియా పై పడిపోయారు నెటిజన్స్. దాంతో సలార్ టీజర్ ఆల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. టీజర్‌కి సెన్సేషన్ రెస్పాన్స్ రావడంతో.. జస్ట్ 12 గంటల్లోనే 45 మిలియన్ వ్యూస్, 1.3 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది.

ఇక 24 గంటల్లో ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ ఇండియాలో ఏ సినిమా టీజర్ కూడా అందుకోని బిగ్గెస్ట్ రికార్డ్ సెట్ చేసింది. సింగిల్ ఛానెల్లో 83 మిలియన్స్‌, 1.6 మిలియన్స్‌ లైక్స్ అందుకున్న ఏకైక టీజర్‌గా సలార్ నిలిచింది. అంతేకాదు.. తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్నాడు ప్రభాస్. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ టీజర్‌ 24 గంటల్లో 69 మిలియన్స్ వ్యూస్ రాబట్టింది. ఆ తర్వాత ప్లేస్‌లో 68 మిలియన్స్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజియఫ్ చాప్టర్ 2 ఉంది. అయితే ఆ తర్వాత స్థానం కూడా ప్రభాస్‌దే కావడం విశేషం. మొత్తంగా తన రికార్డులను తనే తిరిగిరాయగల సత్తా ప్రభాస్‌కే చెల్లింది. ఈ లెక్కన సెప్టెంబర్ 28న ఇంకెన్ని రికార్డ్స్ లేస్తాయే అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version