పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో… ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో తెరకెక్కుతున్న సినిమా సలార్. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ గా ప్రమోట్ అవుతున్న సలార్ నుంచి మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. మరో రెండు నెలల్లో రిలీజ్ కానున్న సలార్ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెడుతూ మేకర్స్ రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేసారు. 24 గంటల్లోనే ఇండియాస్ మోస్ట్ వాచ్డ్ టీజర్ గా సలార్ టీజర్ ఎర్త్ షాటరింగ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది అంటే ఈ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. టీజర్ మాయ నుంచి పాన్ ఇండియా మూవీ లవర్స్ బయటకి రాకముందే ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధమవుతోంది.
Read Also: Bobby : బాలయ్యతో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయబోతున్న యంగ్ డైరెక్టర్..?
ఆగస్టు నెలలో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తున్నాయి వెయిట్ చేయండి అంటూ మేకర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆగస్టు నుంచి సెప్టెంబర్ 28 వరకూ సలార్ తప్ప సోషల్ మీడియాలో ఇంకో ప్రాజెక్ట్ పేరు వినిపించదు అనుకుంటున్న సమయంలో సలార్ టీజర్ థియేటర్స్ లోకి వచ్చింది. అన్ని మేజర్ థియేటర్స్ లో సలార్ టీజర్ ప్లే అవుతోంది. దీంతో ప్రభాస్ ఫాన్స్ టీజర్ ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. టీజర్ కే ఇలా ఉంటే ఇక సినిమాని థియేటర్స్ లో చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ప్రభాస్ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ థియేటర్స్ లో చేస్తున్న సందడి చూస్తుంటే సెప్టెంబర్ 28 ఇప్పుడే వచ్చినట్లు ఉంది అనిపించకమానదు.