NTV Telugu Site icon

Salaar: ‘షారుఖ్’కి సలార్ టీమ్ కౌంటర్.. సారీ చెబుతూనే!

Salaar 2

Salaar 2

Salaar Team posted a satire on Shah Rukh Khan in Social Media: సలార్ మేకర్స్ షారుఖ్ ఖాన్ పై సెటైర్ వేయడం హాట్ టాపిక్ అయింది. 2023 చివరి వారాంతంలో ప్రభాస్ సలార్ అలాగే షారుఖ్ ఖాన్ డంకీ మధ్య భారీ పోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఒక రోజు వ్యవధితో రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ డంకీ రిలీజ్ కాగా డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ రిలీజ్ అయ్యాయి. అయితే సలార్ అన్ని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాగా డంకీ మాత్రం కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే రిలీజ్ ముందు వరకు రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆశించిన స్థాయిలో డంకీ కలెక్షన్స్ రాకున్నా థియేటర్ల విషయంలో షారుక్ ఖాన్ ప్రమేయంతో సలార్ నిర్మాతలు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు.

Muhammad Yunus: నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్‌కు 6 నెలల జైలు శిక్ష

ఇక ఈ క్రమంలోనే సలార్ మేకర్స్ షారుఖ్ ఖాన్ పై సెటైర్ వేశారు. పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా సలార్ నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ ఈరోజు కలెక్షన్స్ అనౌన్స్ చేస్తూ “ ఖాన్సార్.. ఐయామ్ సారీ ” అంటూ బాక్సాఫీస్ పోస్టర్‌ను ప్రకటించారు . వారు ఉద్దేశ్యపూర్వకంగా ఖాన్సార్ వరల్డ్‌ని ఉపయోగించి వ్యంగ్యం చేశారు, షారుఖ్ ను ఖాన్ సార్ అని అభివర్ణిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులు ఎంజాయ్ చేస్తూ ఆ ట్వీట్‌ని ఉపయోగించి షారూఖ్ అభిమానులకు కౌంటర్లు ఇస్తున్నారు. సాలార్ మేకర్స్ ట్వీట్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 625 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఇలా కౌంటర్ ఇచ్చిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఇద్దరు పెద్ద హీరోలు పోటీ పడినప్పుడు ఇలా జరుగడం ఇప్పుడు కామన్ అయింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, ఓపెనింగ్ డే నుండి లేటెస్ట్ పోస్టర్ వరకు, సాలార్ నిర్మాతలు నిరంతరం బాక్సాఫీస్ కలెక్షన్స్ ను పెంచుతూనే ఉన్నారు. వారు పార్ట్ 2 చేయవలసి ఉన్నందున పార్ట్ 1 పెద్ద విజయాన్ని సాధించాలని వారు భావిస్తున్నారు.