NTV Telugu Site icon

Salaar Release Trailer: బిగ్ బ్రేకింగ్.. సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

Praboss

Praboss

Salaar Release Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో వాయిదాల తరువాత డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై హైప్ తీసుకురావడానికి మేకర్స్ తమవంతు కృషి చేస్తున్నారు. ఇక గత రెండు మూడు రోజుల నుంచి సలార్ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని వార్తలు రావడం.. మళ్లీ అది వాయిదా పడడం జరుగుతూనే ఉంది. ఇక ఎట్టకేలకు చాలా వెయిటింగ్ తరువాత కొద్దిసేపటి క్రితమే సలార్ రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ కట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. ఎలా బద్ద శత్రువులుగా మారారు అనేది సలార్ కథగా తెలుస్తోంది.

మొదటి ట్రైలర్ లో పృధ్వీరాజ్ సుకుమారన్ చేత కథ చెప్పించిన డైరెక్టర్.. ఈ ట్రైలర్ లో అసలు కథను చూచాయగా చూపించాడు. స్నేహితుడు కోసం.. ఒక రాజ్యంతో యుద్దాన్ని ప్రకటిస్తాడు దేవా.. చిన్నతనం నుంచి వరద కోసం ఏదైనా చేసే దేవా.. అతని రాజ్యాన్ని అతనికి అప్పగించడానికి ఎంతటి పోరాటం చేశాడు అనేది ట్రైలర్ లో కనిపిస్తుంది.మెకానిక్ గా ప్రభాస్ కనిపించాడు. ఇక ఆ కటౌట్ ను ఎలా వాడుకోవాలో ప్రశాంత్ కు బాగా తెలిసినట్లు కనిపిస్తోంది. మెషిన్ గన్స్.. పోరాటాలు.. కత్తులు.. ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ యాక్షన్ మూవీగా సలార్ గుర్తిండిపోతుందని తెలుస్తోంది. పార్ట్ 1 లో ప్రాణ స్నేహితులు.. పార్ట్ 2 బద్ద శత్రువులుగా ఎలా మారారు అనేది చూపించనున్నారు. ఇక రవి బసూర్ సంగీతం నెక్స్ట్ లెవెల్. జర్నలిస్ట్ గా శృతి హాసన్ కనిపించింది. మామూలుగానే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఇక ఈ ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో చూడాలి.