Salaar Producer return money to Andhra distributors: దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా సలార్ భారీ విజయం సాధించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో కూడా ఈ సినిమా విజయవంతమైంది. బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, “సలార్” ఆంధ్రప్రదేశ్‌లోని డిస్ట్రిబ్యూటర్లు కొందరు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నైజాం ఏరియాలో సినిమా హక్కులను కొనుగోలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌కు “సాలార్” లాభాలను ఆర్జించగా, ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ఎందుకంటే వారు అధిక ధరకు సలార్ హక్కులను కొనుగోలు చేశారు. దీంతో నిర్మాత విజయ్ కిరగందూర్ అన్ని లెక్కలు వేసుకుని ఆర్థికంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి పరిహారం వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది.
Cruel woman: మామను వాకింగ్ స్టిక్‌తో దారుణంగా కొట్టిన కోడలు.. వీడియో వైరల్..
ఒక రకంగా ట్రేడ్ వర్గాల వారు ఇది స్వాగతించదగిన పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే నష్టపోయిన ఆ డిస్ట్రిబ్యూటర్లు తమకి డబ్బు వెనక్కి ఇవ్వాలి లాంటి ఎలాంటి అభ్యర్థనలు చేయలేదు. అయితే విజయ్ కిరంగదూర్ వారిని వ్యక్తిగతంగా పిలిచి వారు పోగొట్టుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చారు. 60 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్ తన పెట్టుబడిని తిరిగి పొందడమే కాకుండా మంచి లాభాలను కూడా ఆర్జించింది. అదేవిధంగా, యునైటెడ్ స్టేట్స్లో డిస్ట్రిబ్యూటర్ కూడా మంచి లాభాలు ఆర్జించారు. USAలో $8.9 మిలియన్లను వసూలు చేసింది. మరోవైపు “సాలార్” రెండవ భాగాన్ని అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు.
