అనుకున్న సమయానికి సలార్ రిలీజ్ అయి ఉంటే… ఈపాటికి రెండో వారంలోకి అడుగుపెట్టి ఉండేది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసి ఉండేంది కానీ.. ఊహించని విధంగా సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడింది సలార్. అయితే ఏంటి? సలార్ లెక్కల్లో మార్పు ఉండదు.. ఓపెనింగ్స్ రికార్డులు మిగలవు.. అని డిసెంబర్ 22 కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు. ఈలోపు అక్టోబర్ 23న రానున్న ప్రభాస్ బర్త్ డే కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈసారి ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరగనున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టేశారు. మరోవైపు… ప్రశాంత్ నీల్ ‘సలార్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు. అక్టోబర్ 23న సలార్ ట్రైలర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి… ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్‌లో సలార్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో స్టార్ట్ కానున్నాయి. అలాగే డిసెంబర్ మొదటి వారంలో సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ను నిర్వాహకులు తట్టుకుంటారా? అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్? ఎందుకంటే.. జస్ట్ సలార్ గురించి ఏదైనా ట్వీట్ పడితేనే సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. అలాంటిది ఈవెంట్ అంటే… ఫ్యాన్స్ తాకిడి సునామీ వచ్చినట్లు ఉంటుంది. డార్లింగ్ కోసం లక్షల మంది తరలొచ్చే ఛాన్స్ ఉంది. కరెక్ట్‌గా చేస్తే సలార్ ఈవెంట్… ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్‌గా నిలవనుంది కాబట్టి ముందే పక్కా ప్లానింగ్‌తో ఎంట్రీ పాసులు మొదలుకొని… ప్రభాస్ ఎంట్రీ వరకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది మేకర్స్.
