NTV Telugu Site icon

Salaar 2: ఊహించిన దానికన్నా ముందుకొచ్చిన ‘శౌర్యాంగ పర్వం’?

Salaar

Salaar

సలార్ రిలీజ్ అయినప్పటి నుంచి… ప్రశాంత్ నీల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనే చర్చ జరుగుతునే ఉంది. వాస్తవానికైతే… ఈ సమ్మర్‌లోనే ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ సలార్ పార్ట్ 1 హిట్ అవడంతో పాటు… ఎన్టీఆర్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దేవర అయిపోగానే వార్2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో ఎన్టీఆర్ 31 మరింత డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే… సలార్ సెకండ్ పార్ట్‌ని మొదలు పెట్టేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సలార్ 2 షూటింగ్ కొంత భాగం కంప్లీట్ అయిందని అంటున్నారు. ప్రభాస్ కూడా వీలైనంత త్వరగా శౌర్యంగపర్వం పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే… స్పిరిట్‌ సెట్స్ పైకి వెళ్లేలోపు సందీప్ రెడ్డి వంగ ‘అనిమల్ పార్క్’ను ప్లాన్ చేస్తున్నాడట.

ఈలోపు ఎలాగు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. అయితే… దేవర రిజల్ట్‌ను బట్టి దేవర 2 ఉంటుంది. అయినా కూడా కొరటాలకు స్క్రిప్ట్ కోసం కొంత సమయం కావాలి కాబట్టి… ఎన్టీఆర్ 31 కంప్లీట్ అయ్యేలోపు కొరటాల ఆ పనిలో ఉంటాడు. సో ఎలా చూసుకున్నా… ముందుగా సలార్ శౌర్యంగ పర్వం తెరకెక్కే ఛాన్స్ ఉంది. అతి త్వరలోనే సలార్ 2 అనౌన్స్మెంట్ బయటికి రానుంది. ప్రభాస్ కూడా కల్కి 2898 ఏడి, ది రాజా సాబ్‌లతో పాటు సలార్2 ఫినిష్ చేసి… ఫ్రెష్‌గా స్పిరిట్ స్టార్ట్ చేయాలనకుంటున్నాడు. ఆ తర్వాత హనురాఘవపూడితో వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో లవ్ స్టోరీ చేయనున్నాడు కాబట్టి… 2025లో సలార్ 2 థియేటర్లోకి రావడం పక్కా. మరి శౌర్యాంగ పర్వం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show comments