Site icon NTV Telugu

Salaar: సలార్ ఫస్ట్ సింగిల్.. సూరీడు వచ్చేది ఎప్పుడంటే.. ?

Salaar

Salaar

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాను కకెజిఎఫ్ ను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ఎంతటి రికార్డులు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో రెండు సాంగ్స్ ఉంటాయని, అవి కూడా బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ అని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా.. లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సలార్ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు అయ్యింది.

సూరీడు అంటూ సాగే ఈ సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కెజిఎఫ్ కు సంగీతం అందించిన రవి బసూరే సలార్ కూడా మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ఈ పోస్టర్ లో ముఖాలు చూపించకుండా ఇద్దరు పిల్లలను చూపించారు. వారే.. దేవా, వరద అని తెలుస్తోంది. వరద చెయ్యిపట్టుకోని దేవా లాకెళ్లుతున్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్ లో వీరిద్దరి స్నేహం చిన్నతనం నుంచి ఉన్నట్లు చూపించారు. వరదకు ఏ కష్టమొచ్చినా దేవా తోడు ఉంటాడు అని చెప్పుకొచ్చారు. ఈ సాంగ్ కు వీరి స్నేహం మీదనే ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version